CARONA తో ఒళ్లు గుల్ల.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు..!

 

కరోనా వైరస్ మనిషి ఆయువు తీస్తోంది.. ఇంతకాలం వైరస్ ఎఫెక్ట్  ఊపిరితిత్తులపై మాత్రమే అనుకున్నాం.. కానీ, ఇది నిన్నటి మాట. ఒక్కసారి వైరస్ శరీరంలోకి వ్యాపించిన తరువాత అన్ని అవయవాలపై దాడి చేస్తోంది. ఈ విషయమే ఇప్పడు అందరినీ హడలెత్తిస్తోంది. కరోనా నోటి నుంచో, ముక్కు నుంచో శరీరంలోకి ప్రవేశించి ఊపిరితిత్తులను నాశనం చేస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. కరోనా, దాని ప్రభావం పై జరుగుతున్న పరిశోధనల్లో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. కరోనా శ్వాస వ్యవస్థపై మాత్రమే కాదు.. గుండె, కిడ్నీ, లివర్‌ వంటి అవయవాలపైనా ప్రభావం చూపుతోందని అధ్యయనాలు చెప్తున్నాయి. కరోనా ఇప్పటికే  ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల మందికిపైగా కబళించింది. మానవ శరీరంలోని ఏ భాగాన్నీ కరోనా వదలటం లేదు. ఊపిరితిత్తులు, గుండే, కిడ్నీ, రక్తం, మెదడు, కండరాలు ఇలా అణువణువునూ వైరస్‌ కబళిస్తోంది.. 

అవయవాలపై కరోనా ప్రభావం రెండు రకాలుగా ఉంటుంది.. కరోనా వైరస్ నేరుగా అవయవాలపై ప్రత్యక్షంగా దాడి చేయటం ఒకటయితే , పరోక్షంగా అవయవాలను పాడుచేయటం మరొకటి. ఈ మధ్యకాలంలో చాలామందికి కరోనా లక్షణాలు లేకుండానే పాజిటివ్‌ వస్తుంది. లక్షణాలు లేవు కదా అని రిలాక్స్‌ అవుతున్న వాళ్లు ఆ తరువాత డేంజర్‌లో పడుతున్నారు. ఉన్నట్టుండి చెస్ట్ పెయిన్ రావటం, పక్షవాతం రావటం, కిడ్నీ సమస్యలు రావటం పెరిగిపోతున్నాయి.  

ఇలాంటి కేసులను పరిశీలిస్తే కరోనా ప్రభావం ఒక్కొక్కరిపై ఒక్కో రకంగా ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం ఏ సమస్య వచ్చినా కరోనా అని అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది.. శరీరంలో రక్త నాళాల గోడల పై దాడి చేసి 16 నుంచి 20 శాతం మందికి గుండె సమస్యలు వస్తున్నాయి.. కరోనా ప్రభావంతో రక్తం గడ్డ కట్టుకుపోవటం చాలా కేసుల్లో రిపోర్ట్ అవుతోంది. దీంతో అన్ని అవయవాలకు రక్తం సరఫరా తగ్గిపోయి.. గుండే తో పాటూ ఇతర అవయవాలు దెబ్బతింటున్నాయి.

ఈ మధ్య కాలంలో చనిపోతున్న వాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్ లను పరిశీలిస్తే ఎక్కువ మంది గుండె సమస్య ఉన్న వాళ్లే ఉన్నారు. వీరిలో యువత కూడా ఉండటం  పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. కరోనా గుండెపై చాలా రకాలుగా దాడిచేస్తోంది. రక్తప్రసరణ ఆగిపోవడం, గుండె కండరాల్లో సమస్య రావటం, రక్తం సరఫరా పంపింగ్ పై ప్రభావం చూపడం ఇలా కరోనా గుండె కొట్టుకోకుండా దిగ్బంధిస్తోంది. కరోనా ప్రభావం కిడ్నీ, కళ్ళు.. చర్మం పై కూడా కనిపిస్తోందంటున్నారు డాక్టర్లు.. ముఖ్యంగా కళ్ళు ఎర్రగా మారుతున్నాయని అంటున్నారు.. ప్రతి అవయంలోనూ ఆంజియో టెన్సిన్ రిసెప్టార్ టూ ఉంటాయి. ఈ ప్రాంతంలో కరోనా అతుక్కుంటుంది..  ఇలా కరోనా  శరీరమంతా పాకి ఒంటిని పీల్చిపిప్పి చేస్తోందని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad