FACEBOOK ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్
మోహన్‍కు ఢిల్లీ అసెంబ్లీ కమిటీ సమన్లు జారీ చేసింది. ఢిల్లీ అల్లర్ల కేసులో ఈ
సమన్లు జారీ అయ్యాయి. శాంతి, సామర్యం అంశంపై ఎమ్మెల్యే రాఘవ్ చదా నేతృత్వంలోని
అసెంబ్లీ కమిటీ అజిత్ మోహన్‍కు లేఖ రాసింది. మంగళవారం తమ ముందు హాజరుకావాలంటూ
కమిటీ తన లేఖలో ఆదేశించింది.
ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీలో జరిగిన అల్లర్లలో ఫేస్‍బుక్ పాత్ర ఉన్నట్టు ఆగస్టు 31వ తేదిన జరిగిన సమావేశంలో కమిటీ భావించింది. అయితే తదుపరి సమావేశానికి ఫేస్‍బుక్ ఇండియా అధికారులు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. విద్వేషపూరిత అంశాలను కావాలనే ఫేస్‍బుక్ అడ్డుకోలేదని కమిటీ నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎఫ్‍బీకి సమన్లు ఇచ్చారు.