UGC NET 2020 అర్హత పరీక్షలను మరోసారి వాయిదా

 యూజీసీ నెట్ 2020 అర్హత పరీక్షలను మరోసారి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో కొత్త తేదీలను ప్రకటించనున్నారు.

యూజీసీ నెట్‌ 2020

జాతీయ అర్హత పరీక్ష యూజీసీ-నెట్‌ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో.. అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్(జేఆర్ఎఫ్) అర్హత కోసం నిర్వహించే యూజీసీ నెట్ అర్హత పరీక్షలను మరోసారి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. యూజీసీ నెట్-2020కి సంబంధించి మొద‌టి విడ‌త పరీక్షలు ఈనెల 16 నుంచి 18 వ‌ర‌కు, రెండో విడుత పరీక్షలు ఈనెల 21 నుంచి 25 వ‌ర‌కు జరగాల్సి ఉండగా.. వాటిని వాయిదా వేస్తున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ(ఎన్‌టీఏ) ప్రకటన చేసింది.

వాయిదా పడిన యూజీసీ నెట్-2020 అర్హత పరీక్షలను ఈనెల 24 నుంచి నిర్వహిస్తామని ఎన్‌టీఏ తన ప్రకటనలో పేర్కొంది. వాస్తవానికి మే, జూన్‌ నెలల్లో జరగాల్సిన యూజీసీ నెట్-2020 పరీక్షలు కరోనా కారణంగా సెప్టెంబర్ కు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం అన్ లాక్ కొనసాగుతుండటం.. వివిధ ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహిస్తుండటంతో నెట్ పరీక్షలు కూడా సాఫీగా సాగుతాయని అంతా భావించారు.

కానీ ఈనెల 16 నుంచి 24 మధ్యలోనే.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐసీఏఆర్) పరీక్షలు ఉండటంతో తేదీలు క్లాష్ కాకూడదన్న ఉద్దేశంతోనే యూజీసీ నెట్-2020 పరీక్షలను వాయిదా వేసినట్లు ఎన్‌టీఏ వివరించింది. రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నష్టపోకుండా పరీక్షను రీ షెడ్యూల్‌ చేశామని వెల్లడించారు. త్వరలో సబ్జెక్టుల వారీగా.. షిఫ్ట్ వారీగా షెడ్యూల్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలను 

https://ugcnet.nta.nic.in/ లేదా https://nta.ac.in/ వెబ్‌సైట్‌లలో చూడొచ్చు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad