విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్.. డైలీ 10 జీబీ డేటా.. ఇందులో నిజమెంత?

Online క్లాసుల కోసం విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఉచిత ఇంటర్నెట్ అందిస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రతి విద్యార్థికి 10 GB డేటాను అందిస్తున్నారని ఓ సందేశం Whatsapp లో వైరల్‌గా మారింది.

కరోనా ప్రభావంతో దాదాపు 8 నెలలుగా స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అన్‌లాక్ 5 సడలింపుల్లో భాగంగా స్కూళ్లు, కాలేజీలకు కేంద్రం అనుమతిచ్చింది. ఐతే ఇప్పటికే చాలా స్కూళ్లు, కాలేజీలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు కూడా డిజిటల్ పాఠాల బాటపట్టాయి. ఈ నేపథ్యంలో విద్యార్థలు జూమ్, గూగుల్ మీట్, జియో మీట్ వంటి యాప్స్ ద్వారా క్లాసులు వింటున్నారు. ఐతే ఆన్‌లైన్ క్లాసుల కోసం విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఉచిత ఇంటర్నెట్ అందిస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రతి విద్యార్థికి 10 GB  డేటాను అందిస్తున్నారని ఓ సందేశం వాట్సప్‌లో వైరల్‌గా మారింది.

''కరోనా వలన స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఉచిత ఇంటర్నెట్ (రోజుకు 10 జీబీ) అందిస్తోంది. ఆన్‌లైన్ క్లాసులు, ఇంటర్నెట్ ద్వారా విద్యార్థులు పాఠాలు వినవచ్చు. పరీక్షలకు సన్నద్ధం కావచ్చు.'' అని అందులో ఉంది. అంతేకాదు ఉచిత ఇంటర్నెట్ కోసం అక్కడ ఇచ్చిన లింక్‌లో వివరాలను నమోదు చేసుకోవాలని.. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి ఫార్వార్డ్ చేయాలని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంపై PIB Fact Check స్పందించింది. ఇది ఫేక్ న్యూస్ అని.. ఇందులో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేసింది. ప్రభుత్వం ఉచిత ఇంటర్నెట్ ఇవ్వడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని ప్రజలకు సూచించింది.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad