SBI announces 8500 apprentice posts


 8500 అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించిన ఎస్‌బీఐ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఉద్యోగాల జాతరకు తెరతీసింది. ఏకంగా 8500 అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది. దేశంలోని వేర్వేరు జోన్లలో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా పోస్టులు ఉన్నాయి. ఇవి మూడేళ్ల అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. వీరిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులుగా గుర్తించరు. ఎంపికైనవారికి మూడేళ్లు ట్రైనింగ్ ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఇప్పటికే డిగ్రీ అర్హతతో 2000 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2020 డిసెంబర్ 4 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ఇప్పుడు 8500 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఎస్‌బీఐ. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 10 చివరి తేదీ. 2021 జనవరిలో ఎగ్జామినేషన్ ఉంటుంది.

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://sbi.co.in/ వెబ్‌సైట్‌లో Careers సెక్షన్‌లో తెలుసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు- 8500

తెలంగాణ- 460 : (ఆదిలాబాద్ -10, భద్రాద్రి కొత్తగూడెం -21, జగిత్యాల -9, జనగాం -10, జయశంకర్ -12, జోగులంబా -9, కామారెడ్డి -16, కరీంనగర్ - 14, ఖమ్మం - 24, కొమరంభీమ్ -7, మహాబూబాబాద్ -12, మహబూబ్‌నగర్ -33, మల్కాజ్‌గిరి -5, మంచిర్యాల -8, మెదక్ -14, నాగర్‌కూర్నూల్ -15, నల్గొండ -22, నిర్మల్ -11, నిజామాబాద్ -39, పెద్దపల్లి -10, రంగారెడ్డి -22, సంగారెడ్డి -20, సిద్దిపేట -17, సిరిసిల్ల -6, సూర్యపేట -28, వికారాబాద్ -23, వనపర్తి -12, వరంగల్ -4, వరంగల్ రూరల్-11, యాదాద్రి భువనగిరి -16)

ఆంధ్రప్రదేశ్- 620:  శ్రీకాకళం- 33, విజయనగరం- 29, విశాఖపట్నం- 44, తూర్పుగోదావరి- 62, పశ్చిమ గోదావరి- 75, కృష్ణా- 53, గుంటూరు- 75, ప్రకాశం- 47, నెల్లూరు- 37, చిత్తూరు- 43, కడప- 51, అనంతపూర్- 28, కర్నూలు- 43

గుజరాత్- 482 కర్నాటక- 600 మధ్యప్రదేశ్- 430 చత్తీస్‌గఢ్- 90 పశ్చిమ బెంగాల్- 480 ఒడిశా- 400 హిమాచల్ ప్రదేశ్- 130 హర్యానా- 162 పంజాబ్- 260 తమిళనాడు- 470 పాండిచ్చెరి- 6 ఢిల్లీ- 7 ఉత్తరాఖండ్- 269 రాజస్తాన్- 720 కేరళ- 141 ఉత్తర ప్రదేశ్- 1206 మహారాష్ట్ర- 644 అరుణాచల్ ప్రదేశ్- 25 అస్సాం- 90 మణిపూర్- 12 మేఘాలయ- 40 మిజోరం- 18 నాగాలాండ్- 35 త్రిపుర- 30 బీహార్- 475 జార్ఖండ్- 200 

 నోటిఫికేషన్ విడుదల- 2020 నవంబర్ 20 

దరఖాస్తు ప్రారంభం- 2020 నవంబర్ 20 

 దరఖాస్తుకు చివరి తేదీ- 2020 డిసెంబర్ 10 

దరఖాస్తు ఎడిట్ చేయడానికి చివరి తేదీ- 2020 డిసెంబర్ 10 

ఆన్‌లైన్ ఫీజు పీమెంట్- 2020 నవంబర్ 20 నుంచి డిసెంబర్ 10 

 దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2020 డిసెంబర్ 25 

విద్యార్హతలు- 2020 అక్టోబర్ 31 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు దరఖాస్తు చేయొచ్చు. 

 వయస్సు- 2020 అక్టోబర్ 31 నాటికి 20 నుంచి 28 ఏళ్లు. 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. 

ఎంపిక విధానం- రాతపరీక్ష, స్థానిక భాషలో పరీక్ష. 

స్టైపెండ్- మొదటి ఏడాది నెలకు రూ.15,000. 

రెండో ఏడాది నెలకు రూ.16,500. 

మూడో ఏడాది నెలకు రూ.19,000. ఇతర అలవెన్సులు, బెనిఫిట్స్ ఉండవు.

పూర్తి వివరాలను https://sbi.co.in/ వెబ్‌సైట్‌లో  తెలుసుకోవచ్చు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad