Article of Charges framed against FAPTO General Secretory

 టీచర్ల ఆకాంక్షలను తెలపడం తప్పట..!

ఫ్యాప్టో రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ నరహరిపై  ఆర్టికల్‌ ఆఫ్‌ ఛార్జెస్‌ అభియోగాలు నమోదు 

మాన్యువల్‌ కౌన్సెలింగ్‌, వేకెన్సీలపై పోరాటానికి ఫలితం 

ఉపాధ్యాయ సంఘాల ధ్వజం.. సంజాయిషీ ఉపసంహరణకు డీఈవోకు అల్టిమేటం

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 12 : ఈ ఏడాది టీచర్ల బదిలీ వ్యవహారం యావత్తు వివాదాలమయంగా జరుగుతోంది. ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌కు బదు లుగా మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ తోపాటు అన్ని వేకెన్సీలను ప్రదర్శిం చాలంటూ ఉద్యమించిన ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర సెక్రటరీ జనరల్‌, నల్లజర్ల మండలం ముసుళ్లకుంట ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ టీచరుగా పనిచేస్తున్న కె.నరహరిపై ఆర్టికల్‌ ఆఫ్‌ ఛార్జెస్‌ను ఫ్రేమ్‌ చేయడంతో పాటు సంజాయిషీ ఇవ్వాలిందిగా ఆదేశిస్తూ డీఈవో సీవీ రేణుక శనివారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు ఒక్కసారిగా మండిపడ్డాయి. బదిలీలకు వెబ్‌ ఆప్షన్లను వ్యతిరేకిస్తూ మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహణతో పాటు అన్ని వేకెన్సీలను బదిలీలకు చూ పాల్సిందిగా విద్యాశాఖ ఉన్నతాధికారులకు మెస్సేజ్‌లు పంపా లంటూ టీచర ్లను వాటప్స్‌ గూపుల ద్వారా ప్రోత్సహిస్తున్నట్టు నరహరిపై అభియోగాలు మోపారు. ఆ ప్రకారం విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశాల మేరకు నరహరిపై చర్యలు తీసుకున్నట్టు డీఈవో వివరించారు. కాగా ఫ్యాప్టో నాయకులపై చర్యలు తీసుకోవడానికే ఉపక్రమించడం ద్వారా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులకు ఒకింత హెచ్చరిక సంకేతాలనే అధికారులు పంపినట్టు భావిస్తున్నారు. ప్రభుత్వ విధానాలపై సోషల్‌ మీడియాలో వస్తున్న వ్యతిరేక పోస్టింగ్‌లపై పలు సందర్భాల్లో స్పందిస్తోన్న ప్రభుత్వం తాజా చర్యతో తొలిసారిగా మిగతా టీచర్లకు, నాయకులకు ఒకింత షాక్‌ ఇచ్చినట్టుగా చెబు తున్నారు. టీచర్ల బదిలీల్లో అన్ని వేకెన్సీలను  ప్రదర్శించాలని, మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని తొలుత నుంచీ ఫ్యాప్టో డిమాండ్‌ చేస్తోంది. దీనిపై వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభించడంతో ఉపాధ్యాయ సంఘాలు పోరు బా ట పట్టాయి. ఈ క్రమంలో డీఈవో కార్యాలయ పికెటింగ్‌తో పాటు డైరెక్టరేట్‌ వద్ద నిరవధిక ధర్నాలను రెండు రోజులుగా కొనసాగిస్తున్నాయి. అయితే బదిలీలన పారదర్శకంగానే జరుపుతామని భరోసా ఇచ్చిన అధికారులు, అదే సమయంలో టీచర్లను రెచ్చగొట్టేలా ప్రోత్సహిస్తున్నారంటూ ప్యాఫ్టో నాయ కులపై చర్యలకు దిగడం సర్వత్రా ఆశ్చర్యం కల్గిస్తోంది. 

ఇదేమైనా విద్రోహమా ?: ఉపాధ్యాయ సంఘాల ధ్వజం 

జిల్లా విద్యాశాఖ నుంచి తనకు ఎటువంటి లేఖ అందలేదని ఫ్యాప్టో నాయ కులు నరహరి వెల్లడించారు. బదిలీలకు వెబ్‌ ఆప్షన్లకు సంబంధించి ప్రభు త్వం విడుదల చేసిన వీడియో లింక్‌పై అభిప్రాయాలను చెప్పాల్సిందిగా టీచర్లను విద్యాశాఖ ఉన్నతాధికారులే అడిగారని వివరించారు. టీచర్లను తాను ఎక్కడా ప్రేరేపించలేదన్నారు. వెబ్‌ ఆప్షన్లపై డెమో చూసిన తర్వాత నచ్చక పోతే మాన్యువల్‌గా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని ఫ్యాప్టోకు హామీ ఇచ్చిన విష యాన్ని అధికారులు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. ఫ్యాప్టో నాయకుడిగా ఉంటూనే స్కూలు విధులకు  న్యాయం చేస్తున్నానని, ఈ క్రమంలో విద్యాశాఖ విడుదల చేసిన ప్రత్యామ్నాయ విద్యా ప్రణాళికకు అనుగుణంగా గత 21 వారాలుగా వర్క్‌షీట్లను తయారు చేసి స్కూలు బాలబాలికలందరికీ ఇస్తున్నా నన్నారు. టీచర్ల ఆకాంక్షల మేరకే తాను పనిచేస్తున్నానన్నారు. 

యూటీఎఫ్‌ ఖండన..

భారత రాజ్యాంగం కల్పించిన ఉపాధ్యాయ సంఘాల ప్రజాస్వామిక హక్కు లను కాలరాసే విధంగా ఫ్యాప్టో సెక్రటరీ జనరల్‌ నరహరిని సంజాయిషీ కోరడాన్ని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్‌ సాబ్జీ, పీ బాబురెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగం ఆర్టికల్‌ 19 డి ప్రకారం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను ప్రశ్నించే హక్కు డీఈవోకు లేద న్నారు. తక్షణమే ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోకపోతే జరిగే పరిణా మాలకు డీఈవో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad