అడ్మిషన్లు..? అయోమయం

ఇంజనీరింగ్‌, ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ సాగదీత

 అడ్మిషన్లపై అస్పష్టత..

 విద్యా సంవత్సరం ప్రారంభమెప్పుడో..?

 విద్యార్థుల ఎదురుచూపులు.. 

 ప్రభుత్వ తీరుపై విసుగు

భీమవరం ఎడ్యుకేషన్‌, డిసెంబరు 12 : విద్యార్థులు అయోమయంలో ఉన్నారు.. అడ్మిషన్లపై స్పష్టత లేకపో వడంతో ఇంజనీరింగ్‌, ఇంటర్‌, డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు. ఈ వారం.. వచ్చే వారం అని అంచనాలు వేసుకుంటున్న విద్యా ర్థులకు ప్రభుత్వ విధానాలతో అసహనం ఏర్పడుతోంది. జిల్లాలో 15 ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్యాలతో పాటు దాదాపు 10 వేల మంది విద్యార్థులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. సర్టిఫికెట్స్‌ పరిశీలన అక్టోబరు 27వ తేదీతో ముగిసినా కళాశాలల ఎంపిక అందుబాటులోకి తీసుకురావడం లేదు. దాదాపు 45 రోజుల నుంచి విద్యార్ధులు ఎదు రుచూస్తూనే ఉన్నారు. ఫీజుల నిర్ణయంపై ప్రభుత్వం తేల్చకపోవడంతో అటు యాజమాన్యాలు ఇటు విద్యార్థులు సతమతమవుతున్నారు. మరోపక్క పదో తరగతి ఉత్తీర్ణత అయినట్లు ప్రకటించి నెలలు గడిచినా ఇంటర్‌ మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభంపై స్పష్టత కరువైంది. జిల్లాలో 212 ఇంటర్‌ కళాశాలలు ఉండగా వీటిలో మొదటి సంవత్సరం చేరే విద్యార్థుల సంఖ్య 40 వేల మంది వరకు ఉంటుంది. పదవ తరగతి అందరూ ఉత్తీర్ణత సాధించినట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఈ ఏడాది ఇంటర్‌లో చేరేవారి సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఆన్‌లైన్‌ విధానం తీసుకురావడంతో ఇంటర్‌ తరగతుల ప్రారంభం గందరగోళంగా మారింది. ఇక డిగ్రీ మొదటి సంవత్సర తరగతులదీ ఇదేదారి. ఈసారి డిగ్రీ చేరికలు ఆన్‌లైన్‌లోనే జరగాలని కొత్త విధానాలు రానున్నాయని విద్యాసంస్థల వారు చెబుతున్నారు. కరోనా లేకుంటే ఇప్పటికే ఇంటర్‌ చివరి దశలో, ఇంజనీరింగ్‌, డిగ్రీ సిల బస్‌లు సగం పూర్తయ్యేవని ప్రభుత్వ నిర్ణయాల వల్ల వెనుకబడేలా చేస్తున్నాయని పలువురు అంటున్నారు.

రెండు నెలలుగా ఎదురుచూస్తున్నా కె.తులసీరావు, ఇంటర్‌ విద్యార్థి

ఇంటర్‌ మొదటి సంవత్సర తరగతులు ఎప్పుడు మొదలవుతాయో తెలియడం లేదు. ఆన్‌లైన్‌ ద్వారా కళాశాలలో చేరాలన్నారు. ఎలా చేరాలి..? అవగాహన లేదు. రెండు నెలలుగా తరగతులు ప్రారంభమవుతాయని ఎదురు చూస్తున్నాను. 

ఏం చేయాలో అర్థం కావడం లేదు ..డి.శివరాం, ఇంజనీరింగ్‌ విద్యార్థి

ఇంజనీరింగ్‌ తరగతులు ఎప్పుడు ప్రారంభమో తెలియడం లేదు. కౌన్సెలింగ్‌లో సర్టిఫికెట్‌ల వెరిఫికేషన్‌ చేశారు. నెలదాటినా కళాశాలల ఎంపిక ఇంకా అవకాశం ఇవ్వలేదు. ఎప్పుడన్నది తేదీ ఖరారు లేదు. ఏమీ అర్థం కావడం లేదు. 

ఏడు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో అడ్మిషన్లు నిలిపివేత 

జిల్లాలో ఏడు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఈ ఏడాది అడ్మి షన్లు నిలిపివేస్తున్నట్లు కాకినాడ జేఎన్‌టీయూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో జిల్లాలో 12 ఇంజనీరింగ్‌ కళాశాలలు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. రెండు వేల సీట్ల వరకు తగ్గే అవకాశం ఉంది. గడిచిన సంవత్సరాలలో విద్యార్థులు చేరకపో వడంతో గతేడాదే అడ్మిషన్లు నిలిపి వేయడంతో రెండు కళాశాలలు మూత పడ్డాయి. ఈ ఏడాది మరో 5 ఇంజనీరింగ్‌ కళాశాలలు నిలిపివేశారు. గతేడాది లెక్కల ప్రకారం 17 ఇంజనీరింగ్‌ కళాశాలలో 7,841 కన్వీనర్‌ కోటా సీట్లు, 3,347 మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లు మొత్తం 11,188 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు 5 ఇంజనీరింగ్‌ కళాశాల అడ్మిషన్‌లు నిలిపివేయడం వల్ల రెండు వేల సీట్లుపైగా తగ్గే అవకాశం ఉంది. అంటే 9 వేల పైబడి సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad