ఏలూరు: తగ్గుతున్న వింత రోగం కేసుల సంఖ్య

ప.గో.జిల్లా: ఏలూరులో భయాందోళనకు గురిచేస్తున్న వింత రోగం కేసుల సంఖ్య తగ్గుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థల బృందాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నాయి. ఏలూరుతో పాటు సమీప గ్రామీణ ప్రాంతాల్లోనూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వచ్చిన నివేదికలన్నీ తాత్కాలికమైనవని, తుది దశ నిర్ధారణకు పంపామని ఏలూరు ఆస్పత్రి సూపరింటెండెంట్ ఏవీఆర్ మోహన్ తెలిపారు. వింత రోగానికి కారణం న్యూరో టాక్జిన్స్‌గా భావిస్తున్నామన్నారు. కాగా డిశ్చార్జ్‌ అయిన వారిలో ముగ్గురు రోగులు మళ్లీ ఆస్పత్రికి వచ్చారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో భయాందోళనకు గురిచేస్తున్న వింత రోగంపై కారణాలు ఓ కొలిక్కి వస్తున్నాయి. వింత రోగంపై వివిధ సంస్థలు, ప్రభుత్వం నివేదికలు సిద్ధం చేశాయి. బాధితుల శరీరంలో లెడ్ హెవీ మెటల్,  నికెల్ పదార్ధాలు ఉన్నట్లు ఎయిమ్స్ నిపుణుల బృందం గుర్తించింది. తాగునీరు లేదా పాల ద్వారా శరీరంలో చేరి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా వీరి నివేదిక అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. న్యూరో టాక్జిన్స్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. తినే ఆహారం లేదా తాగునీరు లేదా పాలే వింతరోగానికి కారణంగా అనుమానిస్తున్నారు. నాడీ వ్యవస్థపై న్యూరో టాక్జిన్స్ ప్రభావం చూపించే  అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల్లో కంటికి సంబంధించి నల్లగుడ్డు స్పందన తగ్గిన లక్షణాన్ని వైద్యులు గుర్తించారు.  వైద్య పరిభాషలో ప్యూపిల్ డైలటేషన్‌గా వైద్యులు పేర్కొంటున్నారు. మయో క్లోనిక్ ఎపిలెప్సీ కావచ్చని గుంటూరు వైద్య నిపుణుల బృందం చెబుతోంది. నివేదికల ప్రకారం  తాగునీరు కలుషితం కావడమే ప్రధాన కారణంగా  అనుమానాలు బలపడుతున్నాయి 

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad