♦7పేపర్లకు కుదిస్తూ నిర్ణయం
♦166 పనిదినాలతో విద్యాసంవత్సరం
♦100మార్కులకు పరీక్షలు
♦50మార్కుల చొప్పున రెండు పేపర్లుగా సైన్స్
♦జులై 5న ఫలితాల వెల్లడి
అమరావతి, ఆంధ్రప్రభ:* రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ప్రతిష్టంభన వీడింది. జూన్ 7వ తేదీ నుంచి 11 పేపర్ల స్థానంలో ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహిం చాలని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్ణ యిం చింది. కోవిడ్ కారణం గా విద్యా సంవత్సరం ప్రారంభం కావడం ఆలస్యమవడం తోపాటు.. పాఠశాలల్లో తరగతుల నిర్వహణ 5నెలలు ఆలస్యంగా నవంబర్ 2 నుం చి మొదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా సంవత్సరం 166 పనిదినాలతొ మే 31నముగియనుంది. మరోవైపు ఒకటో తేదీ నుంచి 6 నుంచి పదో తరగతి విద్యార్థులకు రెండు పూటలా తరగతులు కొనసాగనున్నాయి. మే 31తో పదో తరగతికి సంబంధించి విద్యా సంవత్సరం ముగియనుండగా.. జూన్ ఏడో తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్ ఏడో తేదీ నుంచి 14వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. సైన్స్ సబ్జెక్ట్ మినహా మిగిలిన సబ్జెక్టులన్నీ వంద మార్కులకు పరీక్షలు జరగనున్నాయి. సైన్స్ ను ఫిజికల్ సైన్స్, బయాలాజికల్ సైన్స్ గా విభజించి 50 మార్కులకు చొప్పున రెండు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు చెల్లించాల్సిన ఫీజు గడువు ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి పది వరకు విధించనున్నారు. పరీక్షల అనంతరం జూన్ 17 నుంచి 26 వరకు స్పాట్ వాల్యుయేషన్ జరగనుంది. జూలై ఐదో తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు. దీనికి జూలై సంబంధించిన డిటెయిల్డ్ షెడ్యూల్ ను ఒకట్రెండు రోజుల్లో పాఠశాల విద్యాశాఖ విడుదల చేయనుంది.
♦షెడ్యూల్ ఇలా...
జూన్ ఏడో తేదీన ప్రారంభమయ్యే పరీక్షలన్నీ రోజూ ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచిమధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు జరుగుతాయి
సైన్స్ రెండు పేపర్లకు మాత్రం ఉదయం 9 గంటల నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల వరకు జరగనున్నాయి
🔹ఏడో తేదీ:* ఫస్ట్ లాంగ్వేజ్ లేదా ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్స్
🔹ఎనిమిదో తేదీ:* సెకండ్ లాంగ్వేజ్ లేదా ఓఎస్ఎస్ సీ మెయిన్ లాంగ్వేజ్(సంస్కృతం అరబిక్, పర్షియన్)
తొమ్మిదో తేదీ:* థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లిష్)
🔹పదో తేదీ:* మ్యాథమెటిక్స్
🔹11వ తేదీ:* ఫిజికల్ సైన్స్(50 మార్కులు)
🔹12వ తేదీ:* బయాలాజికల్ సైన్స్(50 మార్కులు)
🔹14వ తేదీ:* సోషల్ స్టడీస్ పరీక్షలు జరగనున్నాయి ఒకేషనల్ థియరీ వాళ్లకు 15వ తేదీ ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు జరుగుతుంది.