అమరావతి: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఉపాధ్యాయులకు సెలవులను రద్దు చేశారు. ఇప్పటికే సెలవుపై ఉన్నవారు విధులకు హాజరుకావాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు సిబ్బంది ముందస్తు సమాచారం లేకుండా జిల్లా కేంద్రాలను దాటి వెళ్లకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.