నేత సిఫారసు.. అనుకున్నచోట DYEO పోస్టింగ్

 ఇంజినీరింగ్‌ అధికారికి విద్యాశాఖలో నియామకం

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ  

dyeo-sklm

శ్రీకాకుళం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): పాలక పెద్దల ఆశీస్సులు ఉండాలే కానీ ఎవరికి ఎక్కడ ఏ పోస్టింగ్‌ కావాలన్నా ఇట్టే ఫైళ్లు చకచకా కదిలిపోతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా నీటి పారుదల శాఖలోని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు పి.శంకరరావు తనకు కావాల్సిన విద్యాశాఖలో డిప్యుటేషన్‌పై నియామక ఉత్తర్వులు తెచ్చుకోవడం చర్చనీయాంశం గా మారింది. పలాస ఆర్‌డబ్ల్యూఎస్‌ డివిజన్‌లో గతం లో పనిచేసిన డీఈఈ శంకరరావుపై అప్పట్లో అనేక అభియోగాలు వచ్చాయి. దీంతో ఆశాఖ అధికారులే విజయవాడలోని చీఫ్‌ ఇంజినీర్‌కు ఆయనను సరెండర్‌ చేశారు. నాటి నుంచి ఆయనకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. 

విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన శం కరరావు.. రాజకీయ పలుకుబడితో కావాల్సిన చోట పోస్టింగ్‌ వేయించుకొనేందుకు కొద్ది రోజులుగా రాజధానిలో తిష్ట వేశారు. విజయనరగం జిల్లాకు చెందిన ఒక ముఖ్య నేత అనుచరుడిని కలిశారు. విద్యాశాఖలో తనకు పనిచేయాలని ఉన్నట్టు వివరించినట్లు తెలిసింది. ఇంకేముంది... ముఖ్య నేత సీనులోకి వచ్చి సిఫారసు చేశారు. దీంతో శాఖలతో సంబంధం లేకుండా శంకరరావు కావాల్సిన చోట అనుకున్న పోస్టింగ్‌ దక్కించుకున్నారు. 

శ్రీకాకుళం జిల్లా గ్రామీణ నీటి పారుదల శాఖ (ఆర్‌డబ్ల్యూఎస్‌)లో డీఈఈగా పనిచేసి.. ప్రస్తు తం వెయిటింగ్‌లో ఉన్న శంకరావును విజయనగరం జిల్లా డిప్యూటీ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌గా డిప్యుటేషన్‌ ప్రాతిపదికన నియమించారు. ఈమేరకు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బి.రాజశేఖర్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యాశాఖలో సర్వశిక్షాభియాన్‌ పథకం కింద జరుగుతున్న అదనపు పాఠశాల భవన నిర్మాణ పనుల పర్యవేక్షణకు ఇతర శాఖల నుంచి ఇంజినీర్లను డిప్యుటేషన్‌పై నియమించడం పరిపాటి. కానీ శంకరరావును ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీరింగ్‌ విభాగం నుంచి విజయనగరం జిల్లా విద్యాశాఖలో డిప్యూటీ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌గా నియమించడం విద్యాశాఖలో చర్చకు దారి తీసింది. ఇం జినీరింగ్‌ శాఖలో పనిచేస్తున్న అధికారిని ఏ ప్రాతిపదికన విద్యాశాఖలో నియమించారో ఆశాఖ ఉన్నతాధికారులకే తెలియాలని పలువురు వాపోతున్నారు. విద్యాశాఖలో అనేకమంది సీనియర్లు ఉండగా.. ఇంజినీరింగ్‌ విభాగం ఉద్యోగిని.. ఎలా నియమిస్తారని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. 

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad