ఏపీలో భారీగా కరోనా కేసులు, గుంటూరులో అత్యధికం, 2వేలు దాటిన యాక్టివ్ కేసులు.

 అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 31,138 నమూనాలను పరీక్షించగా.. 368 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,93,734కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో భారీగా పెరుగుతున్న కొత్త, యాక్టివ్ కేసులు గత 24 గంటల్లో కరోనా బారినపడి ఎవరూ మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 7189 మంది బాధితులు మృతి చెందారు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 263 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,84,357కి చేరింది. కోలుకున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2188 యాక్టివ్ కేసులున్నాయి.

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,47,36,326 కరోనా నమూనాలను పరీక్షించారు. ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 40, చిత్తూరులో 40, తూర్పుగోదావరిలో 20, గుంటూరులో 79, కడపలో 10, కృష్ణాలో 37, కర్నూలులో 49, నెల్లూరులో 20, ప్రకాశంలో 6, శ్రీకాకుళంలో 10, విశాఖపట్నంలో 39, విజయనగరంలో 9, పశ్చిమగోదావరిలో 9 కరోనా కేసులు నమోదయ్యాయి.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad