హైదరాబాద్: ప్రగతి భవన్‌లో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. 33 శాతం పీఆర్సీ ప్రకటించాలని సీఎం కేసీఆర్‌ను ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. పీఆర్సీ పెంపుపై సమాలోచనలు కొనసాగుతున్నాయి. సోమవారం అసెంబ్లీలో పీఆర్సీ ప్రకటనపైనా చర్చిస్తున్నారు. పీఆర్సీ నివేదికలో కంటే ఎక్కువగా పీఆర్సీ ఇచ్చేందుకు సీఎం సుముఖత చూపినట్లు తెలుస్తోంది. పీఆర్సీ పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు సీఎం హామీతో రెండు స్థానాల్లో ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపారు. గెలుపు అనంతరం సీఎం నిర్ణయం కోసం ఉద్యోగుల ఎదురుచూస్తున్నారు.