బ్రేకింగ్ : రేపే (08.04.2021) జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు

 రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు యధావిదిగా జరగనున్నాయి. లెక్క ప్రకారం రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.  ఏప్రిల్ 10 వ తేదీన ఎన్నికల ఫలితాలు ఉంటాయి.  దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను ఏప్రిల్ 1వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసింది.  అయితే, ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై కొన్ని పార్టీలు హైకోర్టులో కేసులు దాఖలు చేశారు.  దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఎన్నికల నిర్వహణపై స్టే ఇచ్చింది.  అయితే, ఈ స్టేపై ఏపీ ఎస్ఈసీ డివిజన్ బెంచ్ లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.  ఈరోజు ఉదయం విచారణ జరిగింది, ఎన్నికల విచారణకు ఎస్ఈసీ సరైన పేపర్స్ ను అందించలేదని, మధ్యాహ్నం 12 గంటలకు అన్ని పేపర్స్ ను సరిగా అందించాలని హైకోర్టు ఎస్ఈసిని ఆదేశించింది.  విచారణ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది.  అనంతరం విచారణ జరగగా దానిని 2.15కి రిజర్వ్ చేసింది. ఇక కొద్దిసేపటి క్రితం ఈ తీర్పు వచ్చింది.  ఎన్నికలకు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఎన్నికలు నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ కొట్టివేసింది. అయితే ఎన్నికల ఫలితాలు మాత్రం కోర్టు చెప్పాకనే లెక్కించాలని పేర్కొంది

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad