బడికి పంపాలా! వద్దా!

విద్యార్థుల తల్లిదండ్రుల్లో డైలమా

నిబంధనలు పాటించాలంటున్న వైద్యులు

10 వేల మంది విద్యార్థులకు పరీక్షలు

నరసాపురంలో నమోదు కాని కేసులు

నరసాపురం రూరల్‌,ఏప్రిల్‌ 6 : కరోనా పేరు వింటేనే తల్లిద ండ్రులు ఉలిక్కి పడుతున్నారు.. బయటకు పంపాలంటేనే భయ పడుతున్నారు..ఎవరితో కలవకు ండా ఎలా ఉంచాలో తెలియక సతమతమవుతున్నారు. బడికి పంపాలా? వద్దా?అనే డైలమాలో కొట్టుమిట్టాడుతున్నారు.. మరో పక్క పెరిగిన ఎండలతో పిల్ల లను ఇంటిలో ఉంచలేక.. బడికి పంపలేక తల్లిదండ్రులు ఇబ్బం దులు పడుతున్నారు..తమ పిల్లలకు ఎక్కడ కరోనా సోకుతుందోనని జాగ్రత్తలు తీసు కుంటున్నారు.అయితే వైద్యులు మాత్రం పాఠశాలల్లో కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తే భయం ఉండదని చెబుతున్నారు. అయితే విద్యా సంస్థలు నిబంధనలు పాటించాల్సి ఉంది. 

పాఠశాలల్లో పడిపోయిన హాజరు శాతం..

ఇటీవల కొన్ని స్కూళ్లలో విద్యార్థులకు పాజిటివ్‌ అంటూ సమాచారం రావ డంతో పాఠశాలలకు వెళ్లే చిన్నారుల్లో సగం మంది తగ్గిపోయారు. వెయ్యి మంది పిల్లలు ఉండే పాఠశాలలో ప్రస్తుతం 400 నుంచి 500 మంది మధ్య మాత్రమే ఉంటున్నారు. మిగిలిన 500 మంది ఇళ్ల వద్దనే ఉంటున్నారు. తొలి విడత కరోనా సమయంలో నరసాపురంలోనే అత్యధికంగా కేసులు నమోద య్యాయి. దీంతో రెండో విడతను చూసి మరింత భయపడుతున్నారు. కరోనా ఎటు నుంచి ఎలా వస్తుందో ఊహించలేక  తమ పిల్లలను స్కూళ్లకు పంపకు ండా ఇళ్ల వద్దనే ఉంచుతున్నారు.జిల్లాలో చూసుకుంటే ఇప్పటి వరకూ ప్రభుత్వ పాఠశాలల్లో చాలా తక్కువ శాతం విద్యార్థులకు మాత్రమే కరోనా సోకినట్టు సమాచారం.ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా వైద్య సిబ్బంది అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కరోనా పరీక్షలు చేస్తోంది. తల్లిదండ్రుల్లో ధైర్యం నింపుతున్నారు. ఏం భయంలేదని చెబుతున్నారు.

10 వేల మంది విద్యార్థులకు పరీక్షలు..

 నరసాపురం మండలంలోని తూర్పుతాళ్ళు, ఎల్‌బిచర్ల పీహెచ్‌సీ పరిధిలోని అన్ని ప్రభుత్వ స్కూళ్ళ విద్యార్థులకు గత కొద్ది రోజుల నుంచి కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 10 వేల మంది విద్యార్థులకు పరీక్షలు చేశారు. ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాకపోవడంతో తల్లిదండ్రులు, వైద్య సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. పరీక్షలు చేయించుకోని వారికి రెండో దశ పరీక్షలు చేస్తున్నారు. ఇటు స్కూళ్ళలో కరోనా నిబంధనలు పాటిస్తున్నారు.   విద్యార్థులకు జ్వరం, దగ్గు, జబ్బు ఉంటే తక్షణం సమీపంలోని ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లకు సమాచారం అందిస్తున్నారు.

నిబంధనలు పాటిస్తే పంపండి : ప్రభాకర్‌, వైద్యుడు

తూర్పుతాళ్ళు పీహెచ్‌సీ పరిఽధిలో సుమారు 4 వేల మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేశాం. ఏ ఒక్కరికీ పాజిటివ్‌ రాలేదు. కరోనా రాకుండా ఎవరి జాగ్రత్తలో వాళ్లుండాలి. పిల్లలను బడికి పంపినా పాఠశాలల్లో కరోనా నిబంధనలు పాటిస్తున్నారో లేదో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. నిబంధ నలు పాటిస్తేనే పాఠశాలలకు పంపండి.. నిబంధనలు పాటించకపోతే వద్దు. 

ఎప్పటికప్పుడు తనిఖీలు : పుష్పరాజ్యం, ఎంఈవో

కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ స్కూళ్ళ వద్ద నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశాం. శానిటైజర్లు, మాస్క్‌లు, భౌతికదూరం పాటించేలా చూస్తున్నాం. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం.  ఏ విద్యార్థి తీరు అనుమానంగా ఉన్నా వైద్య సిబ్బందికి సమాచారమిస్తున్నాం.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad