కోవిడ్ మీద సీఎం జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు !

 సెకండ్ వేవ్ కోవిడ్ తాజా పరిస్థితులు, కట్టడి, వైద్య చికిత్సా ఏర్పాట్లు, వ్యాక్సినేషన్ పై సీఎం కీలక సమీక్ష చేపట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సంబంధిత అధికారులు హాజరయ్యారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఫోన్ చేసిన మూడు గంటల్లో బెడ్ కేటాయించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. 


గ్రీవెన్స్ కోసం 1902 నెంబరు, కోవిడ్‌ సేవల కోసం104 నెంబరు కేటాయించాలన్నారు జగన్. ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను బస్టాండ్‌ వంటి పబ్లిక్‌ ప్లేసుల్లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఈ రెండు నెంబర్లు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. కోవిడ్‌ పరీక్ష మొదలు వైద్యం, మెడిసిన్, శానిటేషన్, క్వాలిటీ ఆఫ్‌ ఫుడ్‌ వరకు.. ఏమాత్రం రాజీ పడొద్దు అన్నారు సీఎం. ప్రైవేట్ హాస్పిటళ్లలో అధిక ఫీజుల పై సీఎం జగన్ దృష్టి సారించారు. హాస్పిటళ్లలో చికిత్స ఫీజులు, ఛార్జీలకు సంబంధించిన వివరాలను రోగులకు అర్ధమయ్యేలా ప్రదర్శించాలన్నారు.

బోర్డులపై ప్రదర్శించిన దాని కంటే ఎక్కువ వసూలు చేస్తే, ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా ప్రజలకు  తెలిసేలా అన్ని వివరాలు ఉండాలని, అవసరమైన ఔషధాలు, ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు రేట్లు కూడా స్పష్టంగా ప్రదర్శించాలి అని ఆదేశించారు. అంతేకాదు ఎక్కడైనా అధిక ఫీజులు, ఛార్జీలు వసూలు చేస్తే, కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇక హోం క్వారంటైన్‌లో ఉన్న వాళ్లు కచ్చితంగా ఇళ్లలోనే ఉండేలా, రెగ్యులర్‌గా మానిటర్‌ చేయాలని అన్నారు. వీరికి ఏడు రకాల ట్యాబ్లెట్లు, క్యాప్సుల్స్‌తో కూడిన కోవిడ్‌ కిట్‌ తప్పనిసరిగా అందించాలని పేర్కొన్నారు జగన్. రేపు అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ గా కోవిడ్ అంశంపై సమావేశం కానున్నారు సీఎం జగన్

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad