కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పటివరకు రద్దైన, వాయిదాపడ్డ ఎగ్జామ్స్ ఇవే

కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో గతేడాది లాగానే ఈసారి కూడా పరీక్షలు రద్దవుతున్నాయి లేదా వాయిదా పడుతున్నాయి. ఇప్పటివరకు రద్దైన, వాయిదాపడ్డ పరీక్షల వివరాలు తెలుసుకోండి.


1. CBSE Board Exams: కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు రద్దయ్యాయి. వీరిని ఇంటర్నల్ అసెస్‌మంట్, ప్రాక్టికల్ ఎగ్జామ్ మార్కుల ద్వారా పాస్ చేసే అవకాశం ఉంది. దీనిపై సీబీఎస్ఈ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. జూన్ 1న మరోసారి పరిస్థితిని సమీక్షించనుంది సీబీఎస్ఈ. 

 2. UGC NET: మేలో జరగాల్సిన యూజీసీ నెట్ ఎగ్జామ్ కూడా వాయిదా పడింది. యూజీసీ నెట్ డిసెంబర్ 2020 సెషన్ పరీక్ష ఇది. కరోనా వైరస్ ప్రభావంతో పలుమార్లు వాయిదాపడింది. గతేడాది డిసెంబర్‌లో నిర్వహించాల్సిన ఎగ్జామ్‌ను మే 2 నుంచి మే 17 వరకు నిర్వహించాలనుకుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA. కానీ సెకండ్ వేవ్ కారణంగా ఈ పరీక్ష కూడా వాయిదా పడింది. పరీక్షలకు 15 రోజుల ముందే కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలిపింది ఎన్‌టీఏ.  

 3. ICSE Board Exams: సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకున్న తర్వాత కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేషన్ ఎగ్జామినేషన్-CISCE ఎగ్జామ్స్‌పై నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షల్ని రద్దు చేసింది. 12వ తరగతి ఆఫ్‌లైన్ పద్ధతిలో జరగనున్నాయి. 

 4. UPSC Civil Services 2020: యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ 2020 ఇంటర్వ్యూలు వాయిదాపడ్డాయి. 2021 ఏప్రిల్ 26 నుంచి జూన్ 18 మధ్య అభ్యర్థులకు ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్ జరగాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇంటర్వ్యూలను వాయిదా వేసింది యూపీఎస్‌సీ. 

 5. SSC CHSL Tier 1 exam: స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ టైర్ 1 పరీక్షను వాయిదా వేసింది. కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తెలిపింది. ఈ ఎగ్జామ్స్ ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 27 వరకు జరగాల్సి ఉంది.  

 6. JEE Main: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA నిర్వహిస్తున్న జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్-JEE మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్ష కూడా వాయిదా పడింది. కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA తెలిపింది. పరీక్షలకు కనీసం 15 రోజుల ముందు విద్యార్థులకు సమాచారం ఇస్తామని తెలిపింది.

7. Telangana SSC Inter Exams: తెలంగాణలో టెన్త్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దయ్యాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు జూన్‌లో ఉండే అవకాశముంది. కరోనా కేసుల తీవ్రతను బట్టి దీనిపై నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం.

8. BR Ambedkar Open University: బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఈడీ ఎంట్రెన్స్ టెస్ట్‌ను వాయిదా వేసింది. ఈ ఎగ్జామ్ ఏప్రిల్ 25న జరగాల్సి ఉంది.

9. Osmania University: ఉస్మానియా విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ పరీక్షల్ని వాయిదా వేసింది. మెడికల్ కాలేజీలు మినహా ఇతర విద్యా సంస్థల్ని మూసేసింది

10. NEET PG 2021: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్-NEET PG 2021 ఎగ్జామ్ వాయిదా పడింది. ఏప్రిల్ 18న ఈ ఎగ్జామ్ జరగాల్సి ఉంది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తారు

11. UPSC EPFO Recruitment 2020: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేన్-EPFO సంస్థలో ఈఓ, ఏఓ పోస్టుల భర్తీ కోసం యూపీఎస్‌సీ నిర్వహించాల్సిన పరీక్ష వాయిదా పడింది. 2021 మే 9న ఈ ఎగ్జామ్ జరగాల్సి ఉంది

12. IES ISS 2020: ఇండియన్ ఎకనమిక్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2020 కి సంబంధించిన ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. ఏప్రిల్ 20 నుంచి 23 మధ్య ఈ ఇంటర్వ్యూలు జరగాల్సి ఉంది.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad