అమెరికాలో ఒకప్పుడు రోజుకు 3-4 లక్షల కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 38,000 దిగువకు రోజువారీ కరోనా కేసులు తగ్గిపోయాయి. మరణాలు కూడా గత సంవత్సర కాలంగా ఎన్నడూ లేనంతగా నిన్నటి రోజున కేవలం 600 మరణాలు మాత్రమే నమోదయ్యాయి. అమెరికాలో 27 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చారని సమాచారం.
అదేవిధంగా ఇంగ్లాండ్ లో కూడా భారీగా తగ్గు ముఖం పట్టిన కరోనా కేసులు. 3 నెలల లాక్ డౌన్ ప్రభావం తో ఇంగ్లాండ్ లో అదుపులో కరోనా. మన దేశంలో కూడా కొంత నెమ్మదించిన కరోనా. మీకు తెలుసా... భారత్ లోని 187 జిల్లాలలో కరోనా మరణాలు నిల్. గోవా, పుదుచ్చేరి, బెంగాల్ లో భారీగా పెరుగుతున్న కేసులు.
తెలంగాణలో కూడా పాజిటివ్ ల సంఖ్య, మరణాల సంఖ్య క్రమంగా స్వల్పంగానైనా తగ్గుతున్న మాట వాస్తవమే. గత వారంతో పోలిస్తే ఈరోజుకు మనం వింటున్న మనకు తెలిసిన వారి మరణాలు తక్కువ కావడం కూడా వాస్తవమే కదా.
అందుకే వాస్తవాల ఆధారంగా మన ఆందోళనను అదుపులో ఉంచుకోవాలి. మీడియాలో హైలైట్ అవుతున్న వార్తలను లైట్ తీసుకోవాలి.భయాన్ని వీడాలి. పరిస్థితులకు తగిన విధంగా తగిన జాగ్రత్తలు పాటించాలి.