Sputnik V: గుడ్ న్యూస్..స్పుత్నిక్ టీకా పంపిణీ ప్రారంభం.. హైదరాబాద్‌లోనే తొలి డోస్.. ఎవరికంటే... ధర ఎంతో తెలుసా.?


రష్యా నుంచి మొత్తం 10 కోట్ల డోస్‌లను దిగుమతి చేసుకొని మన దేశంలో పంపిణీ చేస్తారు. ఆ తర్వాత జులై నుంచి ఇక్కడే వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తారు. స్థానికంగా వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత టీకా ధర తగ్గే అవకాశం ఉందని డాక్టర్ రెడ్డీస్ ప్రతినిధులు చెప్పారు.

కరోనా వైరస్ మహమ్మారిని నివారించే క్రమంలో వ్యాక్సిన్లు కవచంలా మారాయి. ప్రస్తుతం ఇండియాలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు అందుబాటులో ఉండగా.. ఇటీవల రష్యా దేశం తయారు చేసిన తయారవుతున్న స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌కు ఇండియాలో అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే అనుమతించిన సంగతి తెలిసిందే. దీనిని దేశీయంగా డాక్టర్ రెడ్డీస్ ఉత్పత్తి చేయనుంది.

ఇదిలా ఉంటే డాక్టర్ రెడ్డీస్ తాజాగా స్పుత్నిక్ వ్యాక్సిన్ బహిరంగ మార్కెట్ ధరను ప్రకటించింది. ఒక్కో డోసుకు రూ. 995.40గా నిర్ణయించింది. ఇందులో 948 రూపాయలు టీకా ధర కాగా, 5 శాతం జీఎస్టీగా నిర్ణయించారు. ఇతర దేశాల్లో స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ను 10 డాలర్లకు విక్రయిస్తున్నారు. రెండు మోతాదులు వేసుకోవాల్సిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ వచ్చే వారం నుంచి ఇండియా మార్కెట్‌లో వ్యాక్సినేష‌న్‌కు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అలాగే స్పుత్నిక్-వి టీకా తొలి డోసును నేడు ప్రారంభించినట్లు ఆ సంస్థ తెలిపింది.

రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ (Sputnik v) భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఇవాళ్టి నుంచి హైదరాబాద్‌లో పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది. స్పుత్నిక్ వ్యాక్సిన్ తొలి డోస్‌ను డాక్టర్ రెడ్డీస్ కస్టమ్ ఫార్మా సర్వీసెస్ గ్లోబల్ హెడ్ దీపక్ సప్రా తీసుకున్నారు. స్పుత్నిక్ టీకా ధరను కూడా డాక్టర్ రెడ్డీస్ నిర్ణయించింది. రష్యా నుంచి దిగుతమి చేసుకున్న వ్యాక్సిన్‌ ఒక్క డోస్ ధర రూ.995.40 (5శాతం జీఎస్టీతో కలిపి)గా నిర్ణయించింది. ‘' దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ వైరస్‌ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్‌ అత్యంత ప్రభావవంతమైన సాధనం. ఇండియాలో చేపట్టిన అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు తోడ్పాటును అందించడమే మా అతి పెద్ద ప్రాధాన్యత.''అని డాక్టర్‌ రెడ్డీస్‌ ఎండీ జీవీ ప్రసాద్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌ (RDIF) సహకారంతో గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ స్పుత్నిక్ వీ టీకాను అభివృద్ధి చేసింది. మన దేశంలో టీకా పంపిణీ, ఉత్పత్తి కోసం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌తో ఆర్డీఐఎఫ్ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రష్యా నుంచి తొలి విడతలో లక్షా 50వేల డోస్‌ల వ్యాక్సిన్ ఇటీవలే హైదరాబాద్‌కు చేరుకున్నాయి. ఈ టీకాల పంపిణీకి సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరీ నుంచి మే 13న అనుమతి వచ్చింది. ఈ క్రమంలో మే 14 నుంచి టీకా పంపిణీని ప్రారంభించినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ప్రకటించింది.

రష్యా నుంచి మొత్తం 10 కోట్ల డోస్‌లను దిగుమతి చేసుకొని మన దేశంలో పంపిణీ చేస్తారు. ఆ తర్వాత జులై నుంచి ఇక్కడే వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తారు. స్థానికంగా వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత టీకా ధర తగ్గే అవకాశం ఉందని డాక్టర్ రెడ్డీస్ ప్రతినిధులు చెప్పారు. స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ 91శాతం ప్రభావశీలత కలిగి ఉన్నట్లు క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. మన దేశంలో కోవిషీల్డ్, కొవాగ్జిన్ తర్వాత డీసీజీఐ అనుమతి పొందిన మూడో వ్యాక్సిన్ స్పుత్నిక్ కావడం గమనార్హం. స్పుత్నిక్ టీకా మొదటి డోస్ తీసుకున్న తర్వాత.. మూడు వారాల వ్యవధిలో రెండో టీకా తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ రెడ్డీస్‌తో పాటు గ్లాండ్ ఫార్మా, హెటిరో బయోఫార్మా, పనాకీ బయోటెక్, స్టెలిస్ బయోఫార్మా, విర్చో బయోటెక్ సంస్థలతో కలిసి మనదేశంలో ఏటా 85 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలని RDIF లక్ష్యంగా పెట్టుకుంది

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad