కరోనా విషయంలో కాస్త ఉపశమనం కలిగించే న్యూస్.


ఢిల్లీ: కరోనా విషయంలో ఇది నిజంగా కాస్త ఊరటనిచ్చే వార్తే. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కరోనా విషయంలో కేర్ తీసుకోవడంతో కేసుల సంఖ్య గత నాలుగు రోజులుగా కాస్త తగ్గుతూ వస్తోంది. నాలుగు రోజులకు ముందు 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యేవి. ఆ తరువాత రోజురోజుకూ ఆ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 

దేశంలో కొత్తగా 2,81,386 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 4,106 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 35,16,997 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 2.49 కోట్లకు చేరుకుంది. దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 2,74,390 మంది మృతి చెందారు

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad