Europe Unlock: సాధారణ పరిస్థితుల్లోకి యూరప్.. అన్‌లాక్ లోకి 20 దేశాలు.. మరికొన్ని ఆదిశలో.


Europe Unlock: ప్రపంచవ్యాప్త కరోనా మహమ్మారి హాట్‌స్పాట్ గా నిలిచినా యూరప్ ఇప్పుడు సాధారణ పరిస్థితుల వైపు కదులుతోంది, కానీ చాలా జాగ్రత్తగా. ఈ దేశాలలో వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. దీంతో కరోనా వ్యాప్తి చెందే వేగం కూడా మందగిస్తోంది. చాలా దేశాలు ప్రయాణ పరిమితులను తొలగిస్తున్నాయి. వీటిలో, టీకాలు వేసిన తరువాత జనాభాలో ఎక్కువ భాగం పూర్తిగా అన్‌లాక్ పరిస్థితిలోకి వచ్చేశారు. మే 17 నుంచి బ్రిటన్‌ను పూర్తిగా అన్‌లాక్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే, కొత్త వేరియంట్ పై కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఇక యూరప్ గురించి చెప్పుకోవాలంటే, 30 దేశాలలో 20 దేశాలు అన్‌లాక్ అవుతున్నాయి. కొన్ని దేశాలలో షరతులతో వివిధ కార్యకలాపాలు ప్రారంభించారు. కరోనా తో విపరీతంగా ఇబ్బందులు పడ్డ బాధితులు ఉన్న ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్‌లలో హోటళ్లు, రెస్టారెంట్లు, పర్యాటక ప్రదేశాలు అలాగే, అంతర్జాతీయ పర్యటనలు దశల వారీగా తెరవబడుతున్నాయి. ఒక వారంలో చాలా దేశాలలో ప్రధాన కార్యకలాపాలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.

యూరప్ లో అన్‌లాక్ కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఇలా..

UK:

బ్రిటన్ మార్చి 8 నుండి నెమ్మదిగా అన్‌లాక్ చేయబడింది. టీకాలు వేయడం వేగవంతంగా జరుగుతోంది. అలాగే వేగంగా ఆంక్షలు ఎత్తివేస్తున్నారు. పబ్బులు, బార్లు తెరిచారు. 6గురు కలిసి జీవించడానికి అనుమతించారు. మే 17 నుండి పూర్తి అన్‌లాక్ ఇక్కడ సాధ్యమే.

ఇటలీ:

ఇటలీ కూడా నెమ్మదిగా అన్‌లాక్ అవుతోంది. బీచ్‌లు, పర్యాటక ప్రదేశాలు, రెస్టారెంట్లు తెరిచారు. కొన్ని మ్యూజియంలు, సినిమా హౌస్‌లు కూడా తెరిచారు. జూన్ 2 నుండి మరిన్ని ఆంక్షలు ఎత్తివేసె దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఫ్రాన్స్:

దేశంలో ప్రయాణించడానికి అనుమతి ఇచ్చారు. మే 19 నుండి రాత్రి 7 గంటలకు బదులుగా రాత్రి 9 గంటల నుండి కర్ఫ్యూ జరుగుతుంది. రెస్టారెంట్ వినియోగదారులను బహిరంగంగా కూర్చునేలా అవకాశం ఇచ్చారు. దుకాణాలు మరియు సాంస్కృతిక సంస్థలు కూడా తెరుచుకుంటున్నాయి.

స్పెయిన్:

చాలా పరిమితులు ఎత్తివేశారు. కానీ షరతులు వర్తిస్తాయని చెప్పారు. కర్ఫ్యూ కొనసాగించాలని చాలా ప్రావిన్సులు కోరుకుంటున్నాయి. బయట మాస్క్ తప్పనిసరి. యూరప్ నుండి వచ్చేవారికి ఎటువంటి పరిమితి లేదు. ప్రమాదకర ప్రాంతాల నుండి వచ్చేటప్పుడు నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి.

గ్రీస్:

రెస్టారెంట్‌లో, వినియోగదారులు బహిరంగంగా కూర్చోవచ్చు. పర్యాటక ప్రదేశాలు తెరుచుకుంటాయి. కాని విదేశీ పర్యాటకులకు నెగెటివ్ రిపోర్ట్ ఇవ్వడం తప్పనిసరి. టీకా తీసుకుని ఉంటె కనుక, దానికి రుజువు చూపించాల్సి ఉంటుంది. తప్పనిసరి దిగ్బంధం కూడా రద్దు చేశారు.

స్విట్జర్లాండ్:

హోటళ్ళు, మ్యూజియంలు, షాపులు, సినిమా, పార్కులు తెరుచుకుంటాయి. రెస్టారెంట్లలో బహిరంగంగా కూర్చోవచ్చు. విదేశాల నుండి వచ్చేవారికి నెగెటివ్ రిపోర్ట్ లేదా టీకా తప్పనిసరి. రోడ్డు మార్గంలో వచ్చేవారికి షరతులు లేవు.

మే 19 నుంచి ఈ దేశాల్లో ఆంక్షలు ఎత్తివేస్తారు..

ఆస్ట్రియా: మే 19 న రెస్టారెంట్లు, హోటళ్ళు, సినిమాస్ మరియు క్రీడా సంస్థలు ప్రారంస్తారు. కానీ నెగటివ్ రిపోర్ట్ చూపించిన తర్వాతే ఎంట్రీ ఇస్తారు.. టీకాలు వేసిన అంతర్జాతీయ పర్యాటకులు కూడా రాగలుగుతారు.

డెన్మార్క్: దుకాణాలు, రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. రెస్టారెంట్ లోపల తినడానికి, నెగెటివ్ రిపోర్ట్ లేదా టీకాలు వేసుకున్నట్టు సర్టిఫికేట్ తప్పనిసరి. మే 19 నుండి, యూరోపియన్ యూనియన్ అదేవిధంగా స్కెంజెన్ దేశాల ప్రజలు అంతరాయం లేకుండా రావచ్చు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad