Shocking Video: స్మోకింగ్ చేస్తూ.. హ్యాండ్స్ శానిటైజ్ చేసుకున్నాడు..న‌డిరోడ్డుపై ఊహించ‌ని విధ్వంసం.

 Shocking Video: స్మోకింగ్ చేస్తూ.. హ్యాండ్స్ శానిటైజ్ చేసుకున్నాడు.. న‌డిరోడ్డుపై ఊహించ‌ని విధ్వంసం. 

భూ ప్ర‌పంచంలో క‌రోనా సృష్టిస్తోన్న భయంకరమైన విధ్వంసం అంతా, ఇంతా కాదు. ఈ మ‌హమ్మారి మ‌నుషుల నుంచి జంతువులు, ప‌క్షులకు కూడా విస్త‌రించింది.

భూ ప్ర‌పంచంలో క‌రోనా సృష్టిస్తోన్న భయంకరమైన విధ్వంసం అంతా, ఇంతా కాదు. ఈ మ‌హమ్మారి మ‌నుషుల నుంచి జంతువులు, ప‌క్షులకు కూడా విస్త‌రించింది. ప్ర‌స్తుత స‌మ‌యంలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవ‌డానికి మాస్కులు, శానిటైజ‌ర్లు ప్ర‌ధాన వెప‌న్స్ అని నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల, చాలా మంది ప్రజలు తమ ఇళ్ళ నుండి బయటకు వెళ్లిన‌ప్పుడు వీటిని త‌మ‌తో తీసుకెళ్తున్నారు. కానీ ఇటీవల ఒక ప్రమాదం జరిగింది, దాని గురించి విన్న తర్వాత మీరు శానిటైజర్ ఉపయోగించే ముందు ఒక‌టికి వందసార్లు ఆలోచిస్తారు. శానిటైజర్ కారణంగా, ఎవరూ ఊహించ‌లేని విధంగా కారు ప్రమాదం జరిగింది.

వివ‌రాల ప్రకారం, గురువారం కారులో హ్యాండ్ శానిటైజర్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటన అమెరికా మేరీల్యాండ్‌లో చోటుచేసుకుంది. మోంట్‌గోమేరీ కౌంటీ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్… కారులో హ్యాండ్ శానిటైజర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మంటలు సంభవించాయని తెలిపింది. కారులోని వ్య‌క్తి స్మోకింగ్ చేయ‌డ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని తెలిపింది. 

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad