Telangana Lockdown : తెలంగాణలో మరో 10 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగింపు!


Telangana Cabinet Decisions: ముందుగా ఊహించినట్లుగా తెలంగాణ 10 రోజుల పాటు లాక్ డౌన్‌ను పొడిగించారు. అయితే, కరోనా కేసులు తగ్గుతున్నందున ప్రస్తుతం ఉన్న సడలింపు సమయాన్ని ఇంకా కాసేపు పెంచారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకూ లాక్ డౌన్‌ను సడలించారు. ఈ కాలంలో అన్ని కార్యకలాపాలకు మినహాయింపు ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ కఠిన లాక్ డౌన్ ఉండనుంది. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

నిజానికి తాజా సడలింపు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే ఉండనుంది. కానీ, బయటి వారు ఇళ్లకు చేరుకొనేందుకు మరో గంట సేపు వెసులుబాటు కల్పించారు. అంటే మధ్యాహ్నం 2 గంటల వరకూ వెసులుబాటు ఉండనుంది. మధ్యాహ్నం 2 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ లాక్ డౌన్ అమల్లో ఉండనుంది.

మే 12 నుంచి ఇలా..

తెలంగాణలో లాక్ డౌన్ విధించబోమంటూనే ప్రభుత్వం మే 12 నుంచి లాక్ డౌన్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇవాల్టితో గడువు ముగియడంతో మంత్రి వర్గం సమావేశమై దీన్ని మరో 10 రోజుల పాటు పెంచింది. అంటే జూన్ 10 వరకూ లాక్ డౌన్ అమల్లో ఉండనుంది. సీఎం సహా మంత్రులు కేబినేట్ మీటింగ్‌లో చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. మరో పది రోజులు లాక్ డౌన్ పెంచడమే ఉత్తమనే అభిప్రాయానికి వచ్చారు

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad