CM JAGAN కీల‌క నిర్ణ‌యం.. క‌ర్ఫ్యూలో మ‌రిన్ని స‌డ‌లింపులు..


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా క‌ట్ట‌డి కోసం క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తోంది ప్ర‌భుత్వం.. పాజిటివ్ కేసులు క్ర‌మంగా త‌గ్గుతుండ‌డంతో.. స‌డ‌లింపులు ఇస్తూ వ‌స్తున్నారు.. ఇక‌, గ‌తంలో ప్ర‌క‌టించిన క‌ర్ఫ్యూ తేదీ ముగుస్తున్న త‌రుణంలో.. కోవిడ్ ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై స‌మీక్ష నిర్వ‌హించిన సీఎం వైఎస్ జ‌గ‌న్.. రాష్ట్రంలో కర్ఫ్యూ వేళ‌లు స‌డ‌లిస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.. 

తాజా నిర్ణ‌యం ప్ర‌కారం.. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ స‌డ‌లింపులు అమ‌ల్లో ఉండ‌నున్నాయి.. ఈ నెల 20వ తేదీ త‌ర్వాత నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయి.. సాయంత్రం 5 గంటల కల్లా దుకాణాలు మూసివేయాల‌ని.. సాయంత్రం 6 గంటల నుంచి కర్ఫ్యూ కచ్చితంగా అమ‌లు చేయాల‌ని ఆదేశించారు సీఎం.. అయితే, కోవిడ్ కేసులు అధికంగా న‌మోదు అవుతోన్న తూర్పు గోదావ‌రి జిల్లాలో మాత్రం ఉదయం 6 గంట‌ల‌ నుంచి మధ్యాహ్నం 2 గంటల వ‌ర‌కే స‌డ‌లింపులు అమ‌ల్లో ఉంటాయి. మ‌రోవైపు ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు రెగ్యుల‌ర్ టైమింగ్స్ ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం వైఎస్ జ‌గ‌న్.. ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు వచ్చేలా మార్పులు చేయాల‌ని సూచించారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad