Cowin App: ‘కోవిన్ పోర్టల్’ హ్యాక్ అయిందా.? అసలు నిజం ఏంటి.! వివరణ ఇచ్చిన కేంద్ర ఆరోగ్యశాఖ


భారతదేశంలో కోవిడ్ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే 'కోవిన్ పోర్టల్' హ్యంక్ అయిందంటూ 'డార్క్ వెబ్ క్రిమినల్ ఇంటలిజెన్స్' కొన్ని గంటల క్రితం..

భారతదేశంలో కోవిడ్ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే ‘కోవిన్ పోర్టల్’ హ్యంక్ అయిందంటూ ‘డార్క్ వెబ్ క్రిమినల్ ఇంటలిజెన్స్’ కొన్ని గంటల క్రితం ట్విట్టర్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని.. పూర్తిగా నిరాధారమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. కోవిన్ యాప్, పోర్టల్‌లో వ్యాక్సినేషన్ డేటాతో పాటు నమోదు చేసుకున్నవారి డీటయిల్స్ పూర్తి సురక్షితంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, టీకా అడ్మినిస్ట్రేషన్ (కో-విన్) ఎంపవర్డ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ వెల్లడించారు.

మరోవైపు కోవిన్ పోర్టల్ హ్యాక్‌కు గురి కాలేదంటూ సైబర్ ఎక్స్‌పర్ట్ రాజశేఖర్ ట్వీట్ చేశాడు. కోవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న సుమారు 15 కోట్ల మంది పేర్లు, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, జీపీఎస్ వివరాలు ‘డార్క్ లీక్ మార్కెట్’లో 800 డాలర్లకు అమ్మకానికి ఉన్నట్లు డార్క్ వెబ్ పేర్కొంటూ చేసిన ట్వీట్.. ఒక ఫేక్ వార్త మాత్రమేనని రాజశేఖర్ తెలిపాడు. ఇదొక బిట్‌కాయిన్ కుంభకోణమని.. ఈ మార్కెట్ తరచూ ఇలాంటి ఫేక్ డేటా లీక్స్ పోస్ట్ చేస్తూ ప్రజలను దోచేస్తారని చెప్పుకొచ్చాడు. కాబట్టి ప్రజలెవ్వరూ కూడా ఇలాంటి వార్తలను నమ్మవద్దని సూచించాడు. అటు కోవిడ్ వ్యాక్సినేషన్ సైట్ ‘కోవిన్ పోర్టల్’ హ్యాక్ అయిందంటూ వస్తున్న వార్తలపై ఇండోర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad