ఫోర్టిఫైడ్ రైస్ అంటే : ఏపీ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లోని పసిపిల్లలకు, వివిధ హాస్టళ్లలోని విద్యార్థులకు రక్తహీనత రాకుండా పౌష్టికాహారం కలిసిన బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. వీటినే ఫోర్టిఫైడ్ రైస్ అని అంటున్నారు. ప్రతీ 100 కేజీల సాధారణ బియ్యంలో ప్రత్యేకంగా కొన్ని పోషకాలతో తయారు చేసిన కేజీ బియ్యాన్ని కలుపుతారు. తద్వారా పౌష్టికాహార సమస్య కొంతవరకైనా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
రైస్ ఫోర్టిఫికేషన్‌పై గత టీడీపీ ప్రభుత్వం, అధికారులు సమీక్ష జరిపారు. పిల్లల్లో మానసిక, శారీరక ఎదుగుదలకు పౌష్టికాహారం తప్పనిసరి అని భావించారు. రైస్ ఫోర్టిఫికేషన్ ద్వారా విటమిన్ ఎ, డి అందుతాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు. దాంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ జరుగుతోంది. ఇందుకు సంబంధించి టాటా ట్రస్ట్ ఏపీకి సహకారం అందిస్తోంది.
ఫోర్టిఫైడ్ రైస్ వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని భావించిన వైసీపీ ప్రభుత్వం దాన్ని మరింత విస్తరించే క్రమంలో... పశ్చిమగోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా ముసలివారికీ, గర్భిణీలకూ ఫోర్టిఫైడ్ రైస్‌ని పంపిణీ చెయ్యబోతోంది. ఇది సక్సెస్ అయితే... రాష్ట్రమంతా ఇలాంటి రైస్‌ని పంపిణీ చెయ్యడతోపాటూ... రేషన్ కింద కూడా ఫోర్టిఫైడ్ రైస్ ఇచ్చేందుకు ప్రణాళిక వేసుకుంది