Zika Virus in Kerala: కేరళలో కలకలం.. తొలిసారి జికా వైరస్ కేసు నమోదు


కేరళలో వెలుగుచూసిన జికా వైరస్ కేసులు.

పుణేలోని ఎన్ఐవీకి 19 మంది నమూనాలు.

గర్బిణిలో తొలిసారి బయటపడ్డ వైరస్.

New Delhi: Kerala, which has been reporting a surge in coronavirus cases, has officially confirmed its first case of Zika virus - a mosquito-borne viral infection - after the virus was detected in the blood samples of a 24-year-old pregnant woman in Thiruvananthapuram

కేరళలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలోనే అత్యధిక రోజువారీ కేసులు ఆ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. కాగా, కేరళలో జికా వైరస్ కేసు నమోదుకావడం కలకలం రేగుతోంది. జికా వైరస్ కేసులు నమోదయినట్టు కేరళ అధికారికంగా ధ్రువీకరించింది. తిరువనంతపురం జిల్లాలో 13 జికా వైరస్‌ కేసులు నమోదయినట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. ‘పుణెలోని నేషనల్‌ వైరాలజీ ల్యాబ్‌కు 19 శాంపిళ్లను పంపించగా.. 13 మందికి పాజిటివ్‌‌గా అనుమానిస్తున్నామని’ ఓ అధికారి తెలిపారు.

తొలుత 24 ఏళ్ల గర్భిణిలో ఈ వైరస్‌ వెలుగు చూసింది. జులై 7న ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వగా.. శిశువులో వైరస్‌ లక్షణాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండ్ల కలక, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, అనారోగ్యం వంటివి జికా వైరస్ లక్షణాలు. ఈ వైరస్ ఎడిస్ ఎనాఫిలస్ అనే దోమ వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ రకం దోమలు కేరళలో చాలా పెద్ద సంఖ్యలో ఉండటం గమనార్హం. ఇవి డెంగ్యూ, చికున్ గన్యాల వ్యాధులకు వాహకాలుగా పనిచేసే ఈ జాతి దోమలు నిలకడగా ఉన్న మంచినీళ్లు, ఎక్కువగా ఇంటి లోపల ఉంటాయి.

జికా వైరస్ పుట్టుకతో వచ్చే లోపాలు, గుల్లెయిన్-బారే సిండ్రోమ్ అభివృద్ధికి కారణమవుతుంది.రోగనిరోధక వ్యవస్థ, నరాలపై ఈ వైరస్ దాడి చేస్తుంది. అయితే, ఈ వైరస్ సోకిన కొంత మందికి సంకేతాలు లేదా లక్షణాలను బయటపడకపోవచ్చు. అయినప్పటికీ, గర్భిణీలలో సంక్రమణ అభివృద్ధి చెందుతున్న పిండానికి తీవ్రంగా హాని కలిగిస్తుంది. పుట్టుకతో వచ్చే అవయవలోపాలకు దారితీస్తుంది.

ప్రస్తుతం ఈ వైరస్‌కు ఎటువంటి టీకా లేదా నివారణ లేదు. తొలిసారిగా 1947లో ఆఫ్రికాలోని ఉగాండలో గుర్తించారు. 1952లో మనుషుల్లోనూ గుర్తించారు. 2017లో అహ్మదాబాద్‌, తమిళనాడులో ఈ కేసులు వెలుగుచూశాయి. జికా వైరస్ సోకితే జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కళ్లు చర్మం ఎర్రబారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. 2-7 రోజుల పాటు ఇవి కొనసాగితే, నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.

ఈ వ్యాధి మనుషుల నుంచి మనుషులకు, జంతువుల నుంచి మనుషులకు వ్యాపించొచ్చు. గర్భిణుల నుంచి పుట్టబోయే బిడ్డకూ ఇది సంక్రమించవచ్చు. దానివల్ల పిల్లల ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. గర్భస్రావం జరిగే ప్రమాదమూ ఉంది.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad