జీవో 44పై స్టే ఎత్తివేత

 జీవో 44పై స్టే ఎత్తివేత

విద్యాహక్కు చట్టం అమలుపై చర్యలేంటో చెప్పండి

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

 ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్ల కేటాయింపును నిర్దేశించే విద్యాహక్కు చట్టం నిబంధ నల అమలుకు ప్రభుత్వం విడుదల చేసిన జీవో 44పై గతంలో విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది. ప్రైవేట్ విద్యా సంస్థల్లో 25 శాతం సీట్లను ప్రభుత్వం అమలు చేయటంలేదంటూ న్యాయవాది తాండవ యోగేష్ 2017లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖ లు చేశారు. దీనిపై సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూపుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ యోగేష్ వాదనలు వినిపిస్తూ ఉచిత సీట్ల అమలు కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో 44పై స్టే ఉందని గుర్తుచేశారు.

దీనివల్ల ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులకు నష్టం జరుగుతోందని ఇది విద్యా హక్కు చట్టాన్ని నీరు గార్చటంతో పాటు సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించినట్లే అవుతుం దన్నారు. విద్యాహక్కు చట్టాన్ని సుప్రీం కూడా సమర్ధించిందని గుర్తుచేశారు. పాఠశాలలు పున ప్రారంభం నేపథ్యంలో హైకోర్టు గతంలో విధించిన స్టేను ఎత్తివేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం గతంలో విధించిన స్టేను ఎత్తివేస్తూ 25 శాతం ఉచిత సీట్లకు ప్రభుత్వం జారీచేసిన జీవో 44 అ మలుకు ప్రభుత్వం తీసుకునే చర్యలేంటో తేల్చాలని ఆదేశిం చింది. సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని సమర్ధించినందున నిజమైన స్ఫూర్తితో అ మలు చేయాలని స్పష్టం చేస్తూ విచారణ వచ్చేనెల 1వ తేదీకి వాయిదా వేసింది.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad