పత్రికా ప్రకటన
2020 వ సంవత్సరమునకు గానూ, ఫిబ్రవరి 2021 వ సంవత్సరంలో జరిగిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలో ఎంపిక అయిన విద్యార్థులు ఈ సంవత్సరం. తప్పకుండా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ www.scholarships.gov.in నందు తమ వివరములను 15-11-2021 లోపు నమోదు చేసుకొనవలెను. లేని యెడల ఇక ఎప్పటికీ ఏ విధంగా కూడా స్కాలర్షిప్ మంజూరు కాబడదు అని జాతీయ విద్యా మంత్రిత్వ శాఖ, న్యూ' ఢిల్లీ వారు తెలియజేశారు. నవంబరు 2017, 2018, 2019 సంవత్సరములలో ఎంపిక కాబడి, గత సంవత్సరములలో పోర్టల్ నందు నమోదు చేసుకుని స్కాలర్షిప్ పొందిన ప్రతీ విద్యార్థి ఈ సంవత్సరం తప్పకుండా రెన్యువల్ చేసుకొనవలెను. పాఠశాల/కళాశాల పరిధిలో విద్యార్థుల వివరములు ఆమోదించుటకు చివరి తేదీ 15-12-2021 మరియు జిల్లా విద్యాశాఖాధికారి వారి పరిధిలో విద్యార్థుల వివరములను ఆమోదించుటకు చివరి తేదీ. 31-12-2021. కావున ప్రతీ విద్యార్థి ఎట్టి పరిస్తితులలోనూ పోర్టల్ నందు 15-11-2021 లోపు నమోదు చేసుకొని తమ అప్లికేషన్ సంబంధిత పాఠశాల లాగిన్ అదే విధంగా జిల్లా విద్యాశాఖాధికారి వారి లాగిన్ ద్వారా ఆమోదించబడు వరకు కూడా గమనించుకొనవలెను. మరిన్ని వివరములకు కార్యాలయపు వెబ్సైట్ www.bse.ap.gov.in లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నందు గానీ సంప్రదించవలెను అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ ఎ సుబ్బారెడ్డి గారు తెలియజేశారు.
Website: www.scholarships.gov.in