AP Govt Jobs: ఏపీలో 4035 ఉద్యోగాల భర్తీ.. కేబినెట్‌ ఆమోదం

 AP Govt Jobs: ఏపీలో 4035 ఉద్యోగాల భర్తీ.. కేబినెట్‌ ఆమోదం.. త్వరలో నోటిఫికేషన్లు

ధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం అక్టోబర్‌ 28న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీ కేబినెట్ శుభవార్త చెప్పింది

భారీగా ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మొత్తం 4035 ఉద్యోగాలను భర్తీ చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అర్బన్ హెల్త్ క్లినిక్ లలో 560 ఫార్మసిస్టులు, మెడికల్ కాలేజీల్లో 2,190 పోస్టులును నియమంచినున్నట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

వీటితో పాటు కొత్తగా 1,285 ఉద్యోగాలను భర్తీ చేయడానికి మంత్రివర్గం ఆమోదించిందన్నారు. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు త్వరలో విడులయ్యే అవకాశం ఉంది. కరోనా ప్రారంభమైన నాటి నుంచి జగన్ సర్కార్ ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి అధిక ప్రాధాన్యం ఇస్తోంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే 26, 917 ఖాళీలను భర్తీ చేసింది. అలాగే వచ్చే ఏడాదిలో ఇవ్వాల్సిన అమ్మఒడి పథకంపై చర్చించిన మంత్రివర్గం.. ప్రతి విద్యార్థికి 75శాతం హాజరు తప్పనిసరి అనే అంశంపై ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad