అమ్మ ఒడికి బయోమెట్రిక్‌... 75 శాతం హాజరు

అమ్మ ఒడికి బయోమెట్రిక్‌

తల్లిదండ్రులు ఒకరోజు కేటాయించాల్సిందే!

అమరావతి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ‘అమ్మ ఒడి’కి 75 శాతం హాజరు ఉండాలన్న నిబంధనలో భాగంగా ప్రభుత్వం బయోమెట్రిక్‌ హాజరు  ప్రవేశపెట్టింది. ఇప్పటికే హాజరుపట్టీలో ఉపాధ్యాయులు హాజరు తీసుకుని, మళ్లీ దాన్ని యాప్‌లో అప్‌లోడ్‌ చేసి ఉన్నతాధికారులకు పంపిస్తున్నారు. ఇప్పుడు బయోమెట్రిక్‌ కోసం రిజిస్టర్‌ చేసుకునేందుకు విద్యార్థుల తల్లులు సమీపంలోని గ్రామ సచివాలయాలకు రావాల్సి ఉంది. సొంత గ్రామాల్లో  బడులు ఉన్నవారికి ఇబ్బంది లేదుకానీ, పిల్లలు హాస్టల్స్‌లో ఉండి, తల్లిదండ్రులు ఎక్కడో ఉంటే మాత్రం వారంతా ఒకరోజు పని మానుకుని రావాల్సిందే. పనుల సీజన్‌లో పనికి వెళ్లేవారికి ఇది ఇబ్బందికరమేనని అంటున్నారు. ఇబ్బందిలేని ప్రత్యామ్నాయ మార్గం చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad