Big Alert: కొత్త ఏడాదిలో షాకివ్వనున్న గ్యాస్ ధరలు? జనవరి 1న కీలక నిర్ణయం..!
Gas Cylinder Price: కొత్త సంవత్సరం ప్రారంభానికి మరో రోజు మాత్రమే మిగిలి ఉంది. దేశంలో ప్రతి నెలా మొదటి తేదీన కొన్ని మార్పులు లేదా కొత్త నియమాలు జారీ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో కొత్తి ఏడాది ప్రారంభం రోజున అంటే 1 జనవరి 2022 నుంచి కూడా కొన్ని మార్పులు రానున్నాయి. ముఖ్యంగా సామాన్య వినియోగదారుల ఆసక్తికి సంబంధించి అనేక మార్పులు జరగనున్నాయి. కొత్త సంవత్సరం మొదటి తేదీన ఎల్‌పీబీ సిలిండర్ ధరపై షాకింగ్ నిర్ణయం తీసుకోనున్నారు.
చదవండి : షుగర్ రాకుండా ఉండాలంటే
ఎల్పీజీ సిలిండర్ ధరపై ప్రతి నెలా ఒకటో తేదీన సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమావేశంలో ఎల్‌పీజీ సిలిండర్ ధర పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు స్వల్పంగా పెరగడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. అయితే, వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ వంటి గ్యాస్‌ను చౌకగా మారుస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
చదవండి : ఈ వ్యక్తులు పెరుగు అస్సలు తినకూడదు...
జనవరి 1 నుంచి ఎల్‌పీజీ ధరలో మార్పు ఉంటుందా..
అయితే దీపావళికి ముందే ఎల్పీజీ గ్యాస్ ధరను పెంచారు. కమర్షియల్ సిలిండర్లలోనే ఈ పెంపుదల చేయడం కాస్త ఊరట కలిగించే విషయమే అయినా.. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.266 భారీగా పెరిగింది. దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పటికీ రూ.2000 మించి ఉంది. అంతకుముందు రూ.1733గా ఉండేది. అదే సమయంలో ముంబైలో రూ.1683కి లభించే 19 కేజీల సిలిండర్ ప్రస్తుతం రూ.1950కి లభిస్తుంది. అలాగే కోల్‌కతాలో 19 కేజీల ఇండేన్ గ్యాస్ సిలిండర్ రూ.2073.50 కాగా, చెన్నైలో 19 కేజీల సిలిండర్ రూ.2133గా లభిస్తోంది.
చదవండి :
1. LPG GAS సిలెండర్ వాడే వారికి అలర్ట్..!
2.మీ డబ్బులు 5 ఏళ్లలో డబుల్ కావాలంటే
3. మీరు 40 ఏళ్ళ నుంచి పెన్షన్ పొందాలనుకుంటే ఈ పాలసీ తీసుకోండి