ఓమైక్రాన్ అనే మ్యుటేషన్ తీవ్రమైనదా?
ఆయన బెంగళూరు కు చెందిన డాక్టర్. రెండు డోసుల వాక్సిన్ వేసుకొన్నాడు. విదేశాలకు వెళ్ళలేదు. పోనీ దక్షిణాఫ్రికా లాంటి దేశాలనుంచి వచ్చిన విదేశస్థులు ఈయనను కలిసారా అంటే అదీ లేదు.
ఇప్పుడు ఈయనకు ఓమిక్రాన్ ఉందని నిర్ధారణ అయ్యింది. వెనక్కు వెళ్ళితే 20 నవంబర్ నాడు బెంగళూరులో జరిగిన ఒక మెడికల్ కాన్ఫరెన్స్ కు ఆయన హాజరయ్యారు. అక్కడికి వచ్చిన వారందరూ డాక్టర్లే. రెండు డోసులు వేసుకొన్నవారే. మాస్క్ లు పెట్టుకొన్నారు. కోవిడ్ నిబంధనలన్నింటినీ ఖచ్చితంగా పాటించారు.
ఆ కాన్ఫరెన్స్ లో ఈ డాక్టర్ గారికి ఓమిక్రాన్ సోకింది. రెండు రోజులకు (November 22) ఆయనకు టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. డెల్టా అనుకొన్నారు. శాంపిల్ ను జెనోమిక్ సీక్వెన్సింగ్ కు పంపితే దాని result నిన్న వచ్చింది. ఆయనకు సోకింది ఓమిక్రాన్ అని తేలింది.
దీన్ని బట్టి ఏమి ప్రూవ్ అవుతోంది?
1. ఓమిక్రాన్ నవంబర్ మూడో వారానికే మన దేశంలో వుంది.
2. ఇప్పుడు డాక్టర్ గారి అయిదుగురు స్నేహితులకు పాజిటివ్ వచ్చింది.
3. కనీసం మూడు వారాలుగా ఓమిక్రాన్ బెంగళూరులో వున్నా అక్కడ కేసులు పెరగడం లేదు. దీనికి కారణం రెండో వేవ్ లో అధిక సంఖ్యాకులు వైరస్ బారిన పడి ఇమ్మ్యూనిటి తెచ్చుకొన్నారు.
4. డెల్టా వేవ్ కంటే ముందుగానే వాక్సిన్ వేసుకొని డెల్టా నుంచి తప్పించుకొన్న డాక్టర్ లాంటివారికి ఇప్పుడు యాంటీబాడీలు అయిపోవడం, అంతే కాకుండా వాక్సిన్ తొలితరానికి చెందిన ఆల్ఫా వైరస్ కోసం తయారుచేసింది కావడం, ఇప్పటికి ఓమిక్రాన్ గా మ్యుటేట్ కావడంతో అలాంటివారికి ఓమిక్రాన్ సోకింది. కానీ లక్షణాలు మైల్డ్.
దీని అర్థం ఓమిక్రాన్ వేవ్ ఇండియాలో కూడా సీరియస్ అయ్యేది కాదు. అంబులెన్సుల క్యూలు, శ్మశానాలలో శవాల క్యూలు వుండవు.
ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కరోనా సోకకుండా వాక్సిన్ వేసుకొన్నవారికి ఓమిక్రాన్ రావొచ్చు . వచ్చినా లక్షణాలు మైల్డ్ గానే ఉంటాయి.
వీటిని బట్టి మన దేశంలో ఇది ఒక భయంకరమైన సమస్య కానే కాదు. ఇంతకంటే ప్రధానమైన, చర్చించవలసిన అనారోగ్య సమస్యలు అనేకం ఉన్నాయి. కానీ మీడియాలో కేవలం "ఓమైక్రాన్" పైననే ప్రధాన చర్చ. మరోసారి కోవిడ్ నిబంధనలు.... మాస్క్ లేకుంటే వేయి ఫైన్. మళ్ళీ లాక్ డౌన్ పెట్టాలనే వినతులు.
*ఇదంతా ఎవరి సృష్టి!?*
*ఎవరి ప్రయోజనాల కోసం!!?*
*ఆలోచించండి!!!*