GOOGLE కు భారీ షాక్.. 98 మిలియన్ డాలర్ల జరిమానా

GOOGLE కు భారీ షాక్.. 98 మిలియన్ డాలర్ల జరిమానా


మాస్కో: సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌కు రష్యా కోర్టు భారీ షాకిచ్చింది. చట్ట విరుద్ధంగా భావించే
కంటెంట్‌ను తొలగించడంలో విఫలమైనందుకు గాను 7.2 బిలియన్ రూబెల్స్ (98 మిలియన్ డాలర్లు) జరిమానా విధించింది. గూగుల్ రెవెన్యూ ఆధారంగా ఈ జరిమానాను విధించినట్టు కోర్టు తెలిపింది. కాగా, ఈ జరిమానాలు ఒక్క గూగుల్‌కే పరిమితం కాదు. ఈ ఏడాది పలు టెక్నాలజీ సంస్థలపై రష్యా కొరడా ఝళిపించింది. సాధారణంగా జరిమానా మిలియన్ డాలర్ల లోపే ఉండగా, ఈసారి మాత్రం భారీ స్థాయిలో జరిమానా విధించింది.

గూగుల్‌ను పలుమార్లు హెచ్చరించినప్పటికీ పదేపదే చేసిన తప్పే చేయడంతోనే కోర్టు ఈ జరిమానా విధించింది. కోర్టు ఆదేశాలను పరిశీలిస్తున్నామని, తర్వాత ఏం చేయబోతున్నది త్వరలోనే వెల్లడిస్తామని గూగుల్ తెలిపింది. రష్యా తన డిజిటల్ సార్వభౌమాధికారాన్ని రక్షించుకోవడంలో భాగంగా విదేశీ సోషల్ మీడియా సంస్థలు, ఇంటర్నెట్ కంపెనీలపై ఉక్కుపాదం మోపుతోంది. అనధికారిక నిరసనలను ప్రోత్సహించే పోస్టులు, చట్టవిరుద్ధమని భావించే ఇతర విషయాలను తొలగించమని గూగుల్, ట్విట్టర్ సహా పలు కంపెనీలను కోరుతోంది. ఆదేశాలను పెడచెవిన పెట్టే సంస్థలపై భారీ జరిమానాలు విధిస్తోంది. అందులో భాగంగానే మాస్కో కోర్టు గూగుల్‌కు తాజా జరిమానా విధించింది. 


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad