LIC Pension Policy: ఈ ఎల్ఐసీ పాలసీ తీసుకుంటే 40 ఏళ్ల నుంచే పెన్షన్..
LIC Pension Policy | పెన్షన్ కావాలంటే 58 ఏళ్లు వచ్చే వరకు ఆగాల్సిన అవసరం లేదు. 40 ఏళ్ల నుంచే పెన్షన్ (Pension Scheme) పొందొచ్చు. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఓ పాలసీని అందిస్తోంది. ఆ ఎల్ఐసీ పాలసీ (Lic Policy) తీసుకుంటే 40 ఏళ్ల నుంచే పెన్షన్ లభిస్తుంది
చదవండి : ఈ స్కీమ్ లో చేరితే మీ అమ్మాయి పెళ్లి నాటికి రూ.65 లక్షలు..!
1. మీరు ఏదైనా పెన్షన్ స్కీమ్‌లో (Pension Scheme) చేరాలనుకుంటున్నారా? మీ దగ్గరున్న డబ్బు పొదుపు చేసి భవిష్యత్తులో పెన్షన్ పొందాలనుకుంటున్నారా? మార్కెట్లో అనేక పెన్షన్ స్కీమ్స్ ఉన్నాయి. చాలావరకు పెన్షన్ స్కీమ్స్ (Pension Scheme) 58 ఏళ్లు లేదా 60 ఏళ్ల నుంచి మొదలవుతాయి
చదవండి : LIC డబ్బులు ఎప్పుడు వస్తాయో ఇలా తెలుసుకోవచ్చు..!
2. కానీ... లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఇటీవల తీసుకొచ్చిన ఓ పెన్షన్ పాలసీ (Pension Policy) తీసుకుంటే మీరు 40 ఏళ్ల వయస్సు నుంచే పెన్షన్ పొందొచ్చు. ఆ పాలసీ పేరు ఎల్ఐసీ సరళ్ పెన్షన్ (LIC Saral Pension)
చదవండి : రూ.29 పొదుపు చేస్తే రూ.4,00,000 పొందొచ్చు..!
3. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, సింగిల్ ప్రీమియం ప్లాన్. ఈ పాలసీ తీసుకున్న వెంటనే ప్రతీ నెలా పెన్షన్ వస్తుంది. ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI గైడ్‌లైన్స్ ప్రకారం ఎల్ఐసీ ఈ పాలసీ రూపొందించింది
4. ఎల్ఐసీ సరళ్ పెన్షన్ పాలసీలో రెండు యాన్యుటీ ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ 1 ఎంచుకుంటే యాన్యుటెంట్ జీవించి ఉన్నంతకాలం పెన్షన్ వస్తుంది. యాన్యుటెంట్ మరణించిన తర్వాత పెన్షన్ ఆగిపోతుంది. పాలసీ కొనడానికి చెల్లించిన డబ్బులు 100 శాతం నామినీకి వస్తాయి
చదవండి : 6 మంచి లాభదాయకమైన పోస్టల్ ఇన్సూరెన్స్ పాలసీలు
5. ఇక ఆప్షన్ 2 ఎంచుకుంటే యాన్యుటెంట్, వారి జీవితభాగస్వామి బతికి ఉన్నన్ని రోజులు పెన్షన్ వస్తుంది. ఇద్దరూ మరణించిన తర్వాత పాలసీ డబ్బులు మొత్తం నామినీకి వస్తాయి. ఒకసారి యాన్యుటీ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత పాలసీ కొనసాగుతున్న సమయంలో మార్పులు చేసుకోవచ్చు
6. ఎల్ఐసీ సరళ్ పెన్షన్ పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 40 ఏళ్లు పూర్తి కావాలి. గరిష్ట వయస్సు 80 ఏళ్లు పూర్తి కావాలి. కనీసం నెలకు రూ.1,000, మూడు నెలలకు రూ.3,000, ఆరు నెలలకు రూ.6,000, ఏడాదికి రూ.12,000 పెన్షన్ పొందొచ్చు. పెన్షన్ ఎప్పుడు కావాలో పాలసీహోల్డర్ నిర్ణయించుకోవచ్చు
7. అయితే పెన్షన్ ఎంత కావాలన్నది పాలసీ తీసుకున్నప్పుడు చెల్లించిన మొత్తంపై ఆధారపడి ఉంటుంది. గరిష్టంగా ఎంతకైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. ఉదాహరణకు 60 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రూ.10,00,000 చెల్లించి ఈ పాలసీ తీసుకుంటే ఏడాదికి రూ.51,650 చొప్పున పెన్షన్ వస్తుంది
8. పాలసీ తీసుకున్న ఆరు నెలల తర్వాత ఎప్పుడైనా సరెండర్ చేయొచ్చు. యాన్యుటెంట్ లేదా వారి జీవిత భాగస్వామి లేదా వారి పిల్లల్లో ఎవరైనా పాలసీలో సూచించిన అనారోగ్య సమస్యల బారినపడితే ఈ పాలసీ సరెండర్ చేయొచ్చు
9. పాలసీ సరెండర్‌కు అప్రూవల్ లభిస్తే 95 శాతం డబ్బులు వెనక్కి వస్తాయి. పాలసీ తీసుకున్న ఆరు నెలల తర్వాత లోన్ కూడా తీసుకోవచ్చు