Nails color: గోళ్ళని బట్టి ఆరోగ్యం గురించి ఇలా తెలుసుకోవచ్చు

 గోళ్ళని బట్టి ఆరోగ్యం గురించి ఇలా తెలుసుకోవచ్చు…. మరి మీ ఆరోగ్యం ఎలా ఉందో చెక్ చేసుకోండి..!

మన యొక్క గోళ్ళని బట్టి మన ఆరోగ్యం ఎలా ఉంది..? ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. అయితే గోళ్లు చూడడానికి ఒకేలా ఉంటాయి కానీ చాలా తేడాలు ఒకళ్ళ గోళ్ళ నుంచి మరొకరి గోళ్ళకి ఉంటూ ఉంటాయి. కొంతమందికి గోళ్ళు సూదిగా ఉంటే కొంతమందికి సాఫ్ట్ గా ఉండడం ఇలా ఎన్నో మార్పులు ఉంటాయి. అయితే గోళ్ళని బట్టి ఆరోగ్యాన్ని ఎలా తెలుసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. మరి ఇక ఆలస్యం ఎందుకు దీనికోసమే పూర్తిగా చూసేయండి.

సాఫ్ట్ నెయిల్స్:

మీకు గోళ్ళు కొరికే అలవాటు ఉండి మీ గోళ్ళు ఎప్పుడు సాఫ్ట్ గా ఉన్నట్లయితే ఎక్కువ కెమికల్స్ అంటే డిటర్జెంట్స్, నెయిల్ పాలిష్, రిమూవర్ ఇలాంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారని తెలుసుకోవచ్చు. అలానే వీళ్ళలో ఐరన్ లోపం క్యాల్షియం లేదా విటమిన్ బి తక్కువగా ఉండచ్చు.

పసుపు గోళ్లు:

పసుపు రంగు గోళ్లు ఉన్నాయి అంటే మీ గోళ్లు చెత్తగా ఉన్నాయని కాదు అది ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా రియాక్షన్ అయి ఉండొచ్చు. ఎప్పుడూ మీ గోళ్ళు తెల్లగా ఉండి హఠాత్తుగా పసుపు రంగులోకి మారి పోయాయంటే డాక్టర్ ని కన్సల్ట్ చేయడం మంచిది.

గోళ్లపై తెల్లటి మచ్చలు:

జింక లోపం ఉన్నప్పుడు ఇలా తెల్లని మచ్చలు గోళ్లపై ఏర్పడతాయి. అలాగే ఎక్కువ ఒత్తిడి గోళ్లపై పడినప్పుడు కూడా తెల్లటి మచ్చలు వస్తాయి.

గోళ్ళమీద రిడ్జెస్:

ఐరన్ లోపం ఉన్నప్పుడు గోళ్ళ మీద ఇలా ఏర్పడతాయి. పెద్ద వాళ్ళలో కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి.

చూడడానికి గట్టిగా ఉండి సులభంగా విరిగిపోయిన గోళ్ళు:

ఎక్కువగా మహిళల్లో ఇలాంటి గోర్లు ఉంటాయి. తడి తగలడం పొడిబారిపోవడం వలన ఇలా వస్తాయి. అయితే గోళ్లు బాగా విరిగిపోయే వాళ్ళు గ్లవ్జస్ వేసుకుంటే విరగకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి :

1. చలి కాలం లో ఈ టీ తాగటం వలన ఇన్ని ఉపయోగాలా 

2. ప్రతి రోజూ ఉల్లిపాయ తింటే ... పరిశోధనలలో కీలక విషయాలు

3. ఈ వ్యక్తులు పెరుగు అస్సలు తినకూడదు...

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad