AP COVID REPORT 19.01.2022: భారీగా పెరిగిన కరోనా కేసులు పది వేలు పైనే

 #COVIDUpdates: 19/01/2022, 10:00 AM

రాష్ట్రం లోని నమోదైన మొత్తం 21,24,546 పాజిటివ్ కేసు లకు గాను 

*20,65,089 మంది డిశ్చార్జ్ కాగా

*14,522 మంది మరణించారు

* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 44,935/

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజే 10వేల కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 41,713 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 10,057 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ వల్ల నిన్న విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.  కరోనా బారి నుంచి నిన్న 1,222 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 44,935 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,827, చిత్తూరు జిల్లాలో 1,822 కేసులు నమోదయ్యాయి




Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad