మొదలైన బాదుడు… ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ. 21 సర్వీస్ చార్జ్…
డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత ఏటీఎం కు వెళ్లి క్యాష్ తెచ్చుకునేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది. పైగా, ఏటీఎంలలో 5 ట్రాన్సాక్షన్ల వరకు ఉచితంగా అందిస్తున్నారు. 5 ట్రాన్సాక్షన్ల తరువాత ప్రతి ట్రాన్సాక్షన్‌కు సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నారు. కాగా, ఈ సర్వీస్ చార్జీలు మరింతగా పెరిగాయి. ఆర్బీఐ ఇచ్చిన ఆదేశాల మేరకు సర్వీస్ చార్జీలను పెంచుతూ బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. గతంతో ఏటీఎం నుంచి క్యాష్ డ్రా చేస్తే సర్వీస్ చార్జీ కింద రూ. 20 వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ చార్జీలను రూ.21 చేసింది.
Read: S A- l Timetable for 2021-22 - SYLLABUS
పెంచిన చార్జీలు జనవరి 1 నుంచే అమలులోకి వస్తున్నాయి. క్యాష్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అన్నింటికీ ఇది వర్తిస్తుంది. బ్యాంకులకు సంబంధించి ఇతర పన్నులు కాకుండా ఏటీఎం ట్రాన్సాక్షన్‌కు రూ. 21 వసూలు చేసేందుకు ఆర్బీఐ గత ఏడాది జూన్ 10 వ తేదీన అనుమతులు ఇచ్చింది. అ అనుమతులు జనవరి 1, 2022 నుంచి అమలులోకి వచ్చాయి.