ట్యాబ్లెట్ల మీద అడ్డ గీతలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా?

ట్యాబ్లెట్ల మీద అడ్డ గీతలు చూసి.. డిజైన్ బాగుందని ముచ్చటపడుతున్నారా? 

ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా?


ట్యాబెట్ల మీద అడ్డగీత ఎందుకు ఉంటుంది? ఇది డిజైన్ కాదు, దీని వెనుక ఒక పెద్ద కారణం ఉంది. సాధారణంగా అత్యంత పవర్‌ఫుల్ ట్యాబ్లెట్ల మీద ఈ గీతలు కనిపిస్తుంటాయి. ఇంతకీ ఈ గీతల వెనుకనున్న రహస్యం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా?కొన్ని ట్యాబ్లెట్లపై అడ్డగీతలు ఎందుకు ఉంటాయి? మరికొన్ని ట్యాబ్లెట్లపై అలా ఎందుకు ఉండవని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? డిజైనింగ్ కోసం అలా చేశారని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్లే! ట్యాబ్లెట్ల మధ్య సరళ రేఖ ఉండటం వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఈ గీతను డీబోస్డ్ లైన్ అంటారు. ట్యాబ్లెట్ల మధ్యలో గీత కనిపించిందంటే అది పవర్ ఫుల్ ట్యాబ్లెట్ అని గుర్తించాలి. ఇది మధ్యకు విరిచేందుకు అనువుగా ఉంటుంది. అయితే ట్యాబ్లెన్లను విరగొట్టాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న ఇప్పుడు ఎదురవుతుంది.

దీని గురించిన పలు వివరాలను ఫార్మసిస్టులు తెలియజేశారు. వ్యాధుల బారినపడినవారు టాబ్లెట్‌లోని సగం మోతాదును తీసుకోవాల్సి వచ్చినప్పుడు సులభంగా దానిని విరగ్గొట్టేందుకు అనువుగా గీత ఉంటుందని వివరించారు. ఉదాహరణకు వైద్యులు సూచనల మేరకు 250mg ట్యాబ్లెట్‌ను తీసుకోవాల్సివస్తే 500mg ట్యాబ్లెట్‌ను రెండు ముక్కలు చేయవచ్చు. 500mg ఔషధాన్ని రెండు సమాన భాగాలుగా విభజించినట్లయితే, ఒక మోతాదు 250mg అవుతుంది. అయితే అన్ని ట్యాబ్లెట్లకు ఈ అవకాశం ఉండదు. ఇలా గీత లేని ట్యాబ్లెట్లను మధ్యకు విరిచి సగం తీసుకోకూడదు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీరు తీసుకునే మాత్రలోని మిగిలిన సగ భాగాన్ని గాలి చొరబడని చోట ఉంచి, అవసరమైనప్పుడు వినియోగించాలి. అయితే వైద్యుల సలహా లేకుండా ఎటువంటి మందులు వాడకూడదనే విషయాన్ని గుర్తుంచుకోండి.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad