WhatsApp: 2022 New features and Options

 WhatsApp: 2022లో వాట్సాప్‌ నుంచి అదిరిపోయే ఫీచర్లు!

2022 ఏడాదిలో వాట్సాప్‌ తన యూజర్లకు సరికొత్త ఫీచర్లతో సర్‌ప్రైజ్‌ ఇవ్వనుంది. ఆ అప్‌డేట్స్‌ (Updates) ఏంటో ఓ లుక్కేయండి.

No Delete .. Only logout


ఇప్పటిదాకా సెట్టింగ్స్‌లో ఉన్న ‘డిలీట్‌ మై అకౌంట్‌’ (Delete My Account) బటన్‌ ఇక కనిపించకపోవచ్చు. ఆ ఆప్షన్‌కు బదులుగా ‘వాట్సాప్ లాగ్‌అవుట్‌’ రానుంది. ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటి ఇతర సోషల్‌ మీడియా యాప్స్‌కు ఉన్న లాగ్‌అవుట్ సదుపాయాన్నీ వాట్సాప్‌ తన యూజర్లకు అందివ్వనుంది. డిలీట్‌ అకౌంట్‌ ఫీచర్‌తో మన నంబర్‌పైన ఉన్న వాట్సాప్‌ను తొలగించడమే కాకుండా.. ఆ ఖాతాకు సంబంధించిన చాట్‌, మీడియా ఫైల్స్‌ను వాట్సాప్‌ పూర్తిగా తొలగిస్తుంది. కానీ ఇప్పుడు తీసుకురాబోయే లాగ్అవుట్‌ (LogOut) ఫీచర్‌తో వాట్సాప్‌కు కొంత బ్రేక్‌ ఇచ్చి మళ్లీ రావొచ్చు. అకౌంట్‌ డిలీట్‌ అవ్వదు. అలానే అకౌంట్‌కు సంబంధించిన చాట్‌ మెసేజ్‌లు, మీడియా ఫైల్స్‌ అలానే ఉంటాయి. వినియోగదారులు వారికి కావాల్సినప్పుడు లాగిన్‌ చేసి వాట్సాప్‌ను వాడుకోవచ్చు. 

Whatsapp  Reels

ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ (Instagram Reels) చూడాలంటే.. ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లనవసరం లేదు. డైరెక్ట్‌ వాట్సాప్‌లోనే చూసేయొచ్చు. ఇందుకోసం వాట్సాప్‌ స్టేటస్‌, చాట్స్‌, కాల్స్‌లానే.. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ను మరో సెక్షన్‌లా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. బహుశా ఈ ఆప్షన్‌ వస్తే యూజర్స్‌కు వాట్సాప్‌లోనే ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అన్నమాట.

Read later


ఇప్పుడున్న ఆర్కీవ్స్‌ (Archives) ఫీచర్‌ను మరికొంత ఆధునీకరించి రీడ్‌ లేటర్ (Read Later) ఆప్షన్‌ను వాట్సాప్‌ తీసుకురాబోతుంది. మీ స్నేహితులు నుంచి లేదంటే గ్రూప్‌ ఛాట్స్‌ నుంచి వచ్చే మెసేజ్‌లతో విసిగిపోతున్నా.. వాటి వల్ల ముఖ్యమైన మెసేజ్‌లు ఏమైనా మిస్‌ అవుతుంటే.. ఈ రీడ్ లేటర్ ఆప్షన్‌ చక్కని పరిష్కారం. మీ ఫ్రెండ్స్‌ లేదా గ్రూప్ కాంటాక్ట్స్‌ని లాంగ్‌ ప్రెస్‌ చేస్తే ‘రీడ్‌ లేటర్’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేస్తే మీ చాట్‌ లిస్ట్‌ ఆఖరుకు వెళ్లి ఆ కాంటాక్ట్స్ చేరుకుంటాయి. వీటికి నోటిఫికేషన్స్‌ కూడా రావు. మీకు అవసరమైనప్పుడు చాట్స్‌ను కిందికి స్క్రోల్‌ చేసుకొని చూడాలి. కొన్ని టెక్‌ వెబ్‌సైట్స్‌ మాత్రం ఇప్పుడున్న ‘ఆర్కీవ్స్‌’ ఆప్షన్‌కే ‘రీడ్‌ లేటర్‌’ పేరు పెడుతున్నట్లు చెబుతున్నాయి. ఫీచర్ వస్తేగానీ వాట్పాప్‌ ఏం మార్పులు చేసిందో చెప్పలేం.

Insurance Services

వ్యాపార సంబంధిత ఫీచర్‌ కూడా వాట్సాప్​లో రానుంది. యాప్ ద్వారా ఇన్సూరెన్స్​ను (Insurance) కొనుగోలు చేసే సదుపాయం అందించనుంది. హెల్త్ ఇన్సూరెన్స్​తో పాటు మైక్రో పెన్షన్​ స్కీమ్​లు అందుబాటులోకి రానున్నాయి. దీని కోసం పలు ఫైనాన్స్​ సర్వీస్ సంస్థలతో వాట్సాప్ చేతులు కలుపనుంది.

End to End Encryption for  all


యూజర్ల భద్రత విషయంలో వాట్సాప్‌ మరో అడుగు ముందుకేసింది. ఇప్పటిదాకా చాట్‌ మెసేజ్‌లకే పరిమితమైన ఎండ్‌-టు-ఎండ్ (end-to-end encryption) ఎన్‌క్రిప్షన్ సాంకేతికత ఇప్పుడు కాల్స్‌, స్టేటస్, చాట్‌ బ్యాకప్‌ సెక్షన్లకు తీసుకురానుంది. ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ త్వరలోనే యూజర్స్‌కు చేరువకానుందని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్‌ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. విజువల్‌ ఇండికేటర్‌ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌ వాట్సాప్‌ కాల్స్‌ చేసేటప్పుడు, స్టేటస్‌ షేర్‌ చేసేటప్పుడు, చాట్‌ బ్యాకప్‌ తీసే సమయంలో ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ అయినట్లు మెసేజ్‌ కనిపిస్తుందట. మల్టీడివైజ్‌ ఫీచర్‌లో కూడా ప్రతి డివైజ్‌కు, వ్యూ వన్స్‌ ఫీచర్‌కు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌తో రక్షణ కల్పించనున్నట్లు వాట్సాప్‌ తెలిపింది.

New Design

కాంటాక్ట్‌ కార్డులో (contact card) కూడా వాట్సాప్‌ కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న ఇతరులతో ఏమైనా కాంటాక్స్ పంచుకున్నప్పుడు ఆ కాంటాక్ట్‌ పేరుతో పాటు నంబర్‌ డిస్ప్లే అయ్యే విధంగా చేయనున్నారట. అలానే కాంటాక్ట్‌ కార్డును మరింత ఆకర్షణీయంగా డిజైన్‌ చేస్తున్నట్లు టెక్‌ వర్గాల సమాచారం.

Last Seen for every contact


ఇప్పటివరకు లాస్ట్‌ సీన్‌లో (Last Seen) కామన్‌గా మూడు ఆప్షన్స్‌ ఉండేవి. నోబడీ (Nobody).. ఎవరికీ కనిపించకుండా. ఎవ్రీబడీ (EveryBody).. అందరికీ కనిపించేటట్టు. మై కాంటాక్ట్స్‌ (My Contacts).. కాంటాక్ట్స్‌లో ఉన్న వారే చూసేటట్టు. కానీ ఇప్పుడు రాబోయే కొత్త అప్‌డేట్‌లో మన కాంటాక్ట్‌ జాబితాలో ఉన్న ప్రతి కాంటాక్ట్‌కు మీరు అనుమతిస్తేనే ‘లాస్ట్‌ సీన్‌’ చూడగలరు. అంటే ఇప్పుడు ‘మై కాంటాక్ట్స్‌ ఎక్సెప్ట్‌’ (My contacts Except) ఆప్షన్‌ సెలెక్ట్‌ చేసి ఎవరైతే చూడకూడదు అనుకుంటున్నారో వారిని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. మీ ‘లాస్ట్‌ సీన్‌’ని వారు చూడలేరు.

Delete for all at Anytime 


ఎవరికైనా పొరపాటుగా పంపిన మెసేజ్‌లను డిలీట్‌ చేయాటానికి వాట్సాప్‌ డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌ (Delete for Everyone) ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనివల్ల యూజర్‌ పంపిన మెసేజ్‌లో ఏమైనా తప్పులు ఉంటే.. వాటిని డిలీట్ చేసేస్తే అవతలివారు చూడలేరు. అయితే అవి నిర్ణీత కాల వ్యవధిలో (గంట, 8 నిమిషాలు, 16 సెకన్లు) డిలీట్‌ చేసేయాలి. లేదంటే డిలీట్‌ చేయటం సాధ్యపడదు. త్వరలో ఆ టైం లిమిట్‌ను తీసేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో టైంతో సంబంధం లేకుండా, ఎన్ని రోజులు గడిచినా.. మనకు ఇష్టం వచ్చినప్పుడు, అవసరానికి తగ్గట్టు ఆ మెసేజ్‌ లేదా ఫైల్స్‌ను డిలీట్‌ చేసేయొచ్చు.

Power for Group Admins

వాట్సాప్‌లో గ్రూప్‌ సభ్యులు షేర్‌ చేసిన కొన్ని టెక్ట్స్‌, ఫొటో, వీడియో, డాక్యుమెంట్‌ ఫైల్స్‌ గ్రూప్‌ అడ్మిన్‌లను చిక్కుల్లో పడేస్తుంటాయి. వాళ్లు చేసిన పోస్ట్‌ను డిలీట్ చేద్దామంటే.. గ్రూప్‌ అడ్మిన్‌కు ఆ ఆప్షన్‌ ఉండదు. సదరు వ్యక్తి మాత్రమే ఆ మెసేజ్‌ లేదా పోస్ట్‌ను డిలీట్‌ చేయాలి. ఈ సమస్యకు చెక్‌ పెడుతూ.. గ్రూప్‌ అడ్మిన్‌లకు అధికారం ఇస్తూ వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. గ్రూప్‌ సభ్యులు ఎవరైనా ఆ అభ్యంతరకర పోస్ట్‌ లేదా మెసేజ్‌ను గ్రూప్‌లో పెడితే.. గ్రూప్‌ అడ్మిన్‌ దాన్ని తొలగించొచ్చు. ఒకరికి మించి ఎక్కువ మంది అడ్మిన్లు ఉన్నా.. ఈ ఫీచర్‌తో వారందరూ ఆ మెసేజ్‌లను డిలీట్‌ చేయొచ్చు. ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్న ఈ ఫీచర్‌ త్వరలోనే యూజర్స్‌ అందరికీ అండుబాటులోకి రానుంది. 

More Features ...

 బిజినెస్ ఖాతాదారులు తమ దగ్గర్లోని రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు, షాపింగ్ మాల్స్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు బిజినెస్ డైరెక్టరీ పేరుతో కొత్త ఫీచర్‌ రానుంది.

➧ మామూలుగా ఎవరికైనా వాట్సాప్‌లో ఫొటో, టెక్స్ట్‌, మీడియా ఫైల్స్‌ పంపాలంటే సంబంధిత కాంటాక్ట్‌ చాట్‌ పేజ్‌ ఒపెన్‌ చేసి ఫైల్స్‌ అటాచ్‌ చేసి పంపుతాం. ఇలా ఒక్కొక్కళ్లకు సెండ్‌ చేయాలి. లేదంటే.. ఒకళ్లకి సెండ్‌ చేసిన తర్వాత ఫార్వర్డ్‌ లిమిట్‌ ప్రకారం ఐదుగురికి ఫార్వర్డ్ చేయొచ్చు. ఇలా కష్టం గనుక మెసేజ్‌ పంపేముందే కాంటాక్ట్‌లను ఎంపిక చేసుకునేలా సాధారణ SMS తరహా ఫీచర్‌ను వాట్సాప్ పరిచయం చేయనుంది. 

 వాట్సప్‌లో స్టికర్ల వాడకం కొత్తేమీ కాదు. వీటినే వాడుకోవాలనేమీ లేదు. మనకు ఇష్టమైన ఫొటోలనూ స్టికర్‌గా మార్చుకొని, పంపుకోవచ్చు. ఈ ఫీచర్‌ ప్రస్తుతానికి వాట్సప్‌ వెబ్‌లోనే అందుబాటులో ఉంది

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad