మధుమేహం రోగులకు శుభవార్త… అందుబాటులోకి సరికొత్త మాత్ర.
డయాబెటిస్ కట్టడికి మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోనే తొలిసారిగా సెమాగ్లూటైడ్ ఔషధాన్ని నోవోనార్డిస్క్ సంస్థ మాత్ర రూపంలో భారత్‌లోకి తీసుకొచ్చింది. ఇన్నాళ్లుగా ఇంజెక్షన్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఔషధం ఇకపై నోటి మాత్ర రూపంలో లభ్యం కానుంది. ప్రపంచంలోనే ఇది తొలి, ఏకైక ఓరల్ సెమాగ్లూటైడ్ కావడం గమనార్హం. డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో బ్లడ్‌షుగర్‌ను అదుపులో ఉంచడం, బరువు తగ్గించడంలోనూ ఈ ఔషధం ఉపయోగపడుతుందని నోవోనార్డిస్క్ సంస్థ పేర్కొంది.
ALSO READ:
ఈ ఔషధంపై భారత్ సహా పలు దేశాల్లో 10 ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్టు నోవోనార్డిస్క్ సంస్థ తెలిపింది. ట్రయల్స్‌లో పాల్గొన్న వారిలో వెయ్యికి మందికిపైగా భారతీయులే ఉన్నారని పేర్కొంది. అమెరికాలో ఈ ట్యాబ్లెట్‌కు 2019లోనే ఆమోదం లభించగా, భారత్‌లో డిసెంబరు 2020లో ఆమోదం లభించింది. ఇంజెక్షన్ కన్నా నోటి మాత్రలు వాడకానికి సులభం కాబట్టి.. సెమాగ్లూటైడ్‌ను మాత్రల రూపంలో అందుబాటులోకి తేవడానికి నోవోనార్డిస్క్ సంస్థ దాదాపు 15 సంవత్సరాల పాటు విస్తృత పరిశోధనలు చేసి ఎట్టకేలకు విజయం సాధించింది.