SBI వినియోగదారులకు శుభవార్త.. తక్కువ వడ్డీకే 3 రకాల లోన్స్!

 ఎస్‌బీఐ వినియోగదారులకు శుభవార్త.. తక్కువ వడ్డీకే 3 రకాల లోన్స్!

ఎస్‌బీఐ తన వినియోగదారులకు శుభవార్త అందించింది. తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్, గోల్డ్ లోన్, కారు లోన్ వంటి 3 రకాల లోన్స్ అంధించనున్నట్లు తెలిపింది. గోల్డ్ లోన్‌పై ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా వడ్డీ ఇస్తున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఈ గోల్డ్ లోన్ మీద వడ్డీ రేటు 7.3 శాతం నుంచి ప్రారంభం కానుంది. అంతేకాకుండా రుణ మొత్తాన్ని చెల్లించడానికి పలు ఆప్షన్లు అందుబాటులో ఉంచింది. బుల్లెట్, ఓవర్‌డ్రాఫ్ట్, ఈఎంఐ వంటి ఆప్షన్లలో మీకు నచ్చింది ఎంచుకోవచ్చు. తీసుకున్న రుణాన్ని 36 నెలలలోగా తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. మీ దగ్గర ఉన్న బంగారం నాణ్యతను బట్టి రూ. 20 వేల నుంచి రూ. 50 లక్షల వరకు లోన్ ఇవ్వనుంది

అలాగే, ఎస్‌బీఐ కారు లోన్ ఇస్తున్నట్లు పేర్కొంది. ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. దీని మీద వడ్డీ రేటు 7.25 శాతం నుంచి ప్రారంభం కానుంది. కారు ధరలో 90 శాతం వరకు రుణం పొందొచ్చు. ఎలాంటి ప్రిపేమెంట్ చార్జీలు కూడా ఉండవు. అలాగే టూవీలర్ లోన్ పొందాలని భావించే వారికి కూడా ఈజీ రైడ్ ప్రిఅప్రూవ్డ్ రుణాలు లభిస్తున్నాయి. రూ.10 వేలకు ఈఎంఐ రూ.251 నుంచి ప్రారంభం అవుతోంది.

ఇక మీరు వ్యక్తిగత రుణాలు తీసుకోవాలంటే వాటికి కూడా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తుంది. ఈ రుణాలపై వడ్డీ రేటు 9.6 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. అలాగే కేవలం 4 క్లిక్స్‌తోనే లోన్ పొందొచ్చని బ్యాంక్ పేర్కొంటోంది. ఈ తరహా రుణాలపై కూడా ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ఇకపోతే ఈ రుణాలు అన్నీ కూడా యోనో యాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad