instant loan Vs Gold loan: ఏ లోన్ తీసుకోవడం మంచిది ?

 ఇన్‌స్టాంట్ లోన్ మరియు  గోల్డ్ లోన్: ఏ లోన్  తీసుకోవడం మంచిది ?

చాలా వరకు రుణాలు ప్లాన్ చేసుకోనివి ఉంటాయి. కొన్నిసార్లు అకస్మిక ఖర్చులు, వైద్య అవసరాలు, ఇతర అవసరాల పరిస్థితుల్లో తక్షణమే రుణాలు తీసుకునే పరిస్థితులు వస్తాయి. రుణం పొందటం అంత సులభం కాదు. కొన్ని సందర్భాల్లో సంప్రదాయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి రుణం పొందటం చాలా సమయం తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో అత్యవసరంగా రుణం అవసరమై, అధిక వడ్డీ రేటును అందించే ఆర్థిక సంస్థల నుండి తీసుకుంటే రుణ భారం కంటే వడ్డీ అధిక భారమవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఏ లోన్ తీసుకుంటే బెట్టర్ చెక్ చేసుకోవడం మంచిది.

తక్షణ రుణాలు 

మారుతున్న కాలానికి అనుగుణంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా టెక్నాలజీని అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ఇదివరకు రుణం తీసుకోవాలంటే పేపర్ వర్క్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు పేపర్-లెస్ రుణాలు అందుబాటులో ఉంటున్నాయి. మనం ఇప్పుడు షాపింగ్, కమ్యూనికేషన్, ట్రావెల్ బుకింగ్, స్టడీ తదితర వాటి కోసం ఒక్క క్లిక్ పైన ఆధారపడుతున్నాము. అలాగే, సింపుల్ ఆన్ లైన్ స్టెప్స్ ద్వారా తక్షణమే రుణాలు అందించే ఆర్థిక సంస్థలు ఎన్నో. మెడికల్ ఎమర్జెన్సీ, ముఖ్య ఆస్తుల కొనుగోలు, వివాహ సన్నాహాలు, ప్రయాణ ఖర్చులు, మొదలైన వాటి కోసం మీకు డబ్బు అవసరం కావొచ్చు. ప్రణాళిక లేని ఈవెంట్‌లకు తక్షణ ఆర్థిక వనరులు అవసరం. అలాంటి సమయంలో ఇన్‌స్టాంట్ లోన్స్ ఉపయోగపడతాయి

సమయం ఆదా 

ఇవి సాధారణంగా ఆన్‌లైన్‌లో ఇన్‌స్టాంట్‌గా ఉంటాయి. వీటి కోసం చాలా డాక్యుమెంట్స్ అవసరం ఉండదు. ఇన్‌స్టాంట్ రుణాలు వేగంగా ప్రాసెస్ చేస్తారు. ఈ ప్రక్రియ అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ రుణాలను పర్సనల్ లోన్ లేదా ఇన్‌స్టాంట్ రుణాలు అని పిలుస్తారు. బ్యాంకును సందర్శించకుండానే, వివిధ రకాల ఫామ్స్ పూరించకుండానే ఆన్‌లైన్‌లో తక్షణ రుణాన్ని పొందవచ్చు. ఇన్‌స్టాంట్ రుణం

 రుణదాత, రుణగ్రహీత... ఇద్దరి సమయాన్ని ఆదా చేస్తుంది

బంగారం రుణం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద వినియోగదారులలో భారత్ ఒకటి. పారిశ్రామిక, వాణిజ్య లేదా పెట్టుబడి ప్రయోజనాల కోసం కూడా వినియోగిస్తారు. బంగారాన్ని వివాహాది, వివిధ శుభకార్యాలయాలకు ఉపయోగిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ఇన్‌స్టాంట్ లేదా పర్సనల్ రుణంతో పాటు బంగారం రుణాన్ని కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. బంగారం రుణం చాలా సులభమైన ప్రాసెస్. సంప్రదాయ రుణాల కంటే ఇది సరళమైన ప్రక్రియ. మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నప్పటికీ తక్కువ పేపర్ వర్క్‌తో మీరు రుణం పొందుతారు. అయితే మీరు అప్పుల ఊబిలోకి పడిపోకుండా, నమ్మకమైన రుణగ్రహీతల నుండి మాత్రమే రుణాలు తీసుకోవాలి.

బంగారం తాకట్టు పెడితేనే... 

బంగారం రుణం తీసుకోవాలంటే బంగారాన్ని తాకట్టు పెట్టాలి. రుణ మంజూరు బంగారం ఆ రోజు వ్యాల్యూపై ఆధారపడటంతో పాటు, వ్యాల్యూలో కొంత శాతం ఇస్తారు. బంగారం వ్యాల్యూ రూ.1 లక్ష అయితే రూ.70,000 నుండి రూ.80,000 వరకు రుణం ఇవ్వవచ్చు. రుణ మంజూరు అంశం గోల్డ్ ప్యూరిటీపై కూడా ఆధారపడి ఉంటుంది.

instant  loan Vs Gold loan లక్షణాలు 

ఇన్‌స్టాంట్ రుణం కోసం మీరు శాలరీ స్లిప్స్ సహా పలు పత్రాలను అప్ లోడ్ చేయాలి. ట్రాన్సాక్షన్ పూర్తిగా పేపర్‌లెస్. మీరు ప్రీ-అప్రూవ్డ్ కస్టమర్ అయితే మినిమం డాక్యుమెంటేషన్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏమీ సమర్పించవలసిన అవసరం ఉండదు. తక్షణ రుణం అసురక్షిత రుణం. కాబట్టి వడ్డీ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇందుకు మీరు ఎలాంటి సెక్యూరిటీ లేదా కొలెటెరల్ సమర్పించాల్సిన అవసరం లేదు. తక్షణమే రుణం అవసరమైతే ఆమోదించబడిన నిధులు వెంటనే మీ ఖాతాకు బదలీ అవుతాయి. సంప్రదాయ రుణాలతో పోలిస్తే ప్రాసెసింగ్ సమయం తక్కువగా ఉంటుంది. రుణ కాలపరిమితిని ఎంచుకోవచ్చు. ఇక గోల్డ్ లోన్ అయితే రుణ ప్రక్రియ మరింత సరళతరంగా ఉంటుంది. ముందుగా అన్ని డాక్యుమెంట్స్, తాకట్టు పెట్టే బంగారు వస్తువులను సమర్పించాలి. వాటిని మూల్యాంకనం చేసిన తర్వాత రుణ దాత రుణ మొత్తాన్ని మంజూరు చేస్తాడు. ఇది సెక్యూర్డ్ లోన్. వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. ఎన్బీఎఫ్‌సీలతో పోలిస్తే బ్యాంకులు తక్కువ వడ్డీని వసూలు చేస్తాయి. గోల్డ్ లోన్ కాలపరిమితి 3 నెలల నుండి 12 నెలల వరకు ఉంటుంది.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad