WhatsApp: వాట్సాప్‌ కొత్త అప్‌డేట్‌.. వాయిస్‌ కాల్స్‌ NEW LOOK

 WhatsApp: వాట్సాప్‌ కొత్త అప్‌డేట్‌.. వాయిస్‌ కాల్స్‌ NEW LOOK!


ఇంటర్నెట్‌ డెస్క్: ఎప్పుటికప్పుడు వినూత్న ఫీచర్లతో ఈ మధ్య దూకుడు ప్రదర్శిస్తున్న యూజర్‌ ఫ్రెండ్లీ యాప్‌ వాట్సాప్‌ మరో కొత్తదనంపై దృష్టిపెట్టింది. కొత్త వాయిస్‌ కాల్‌ ఇంటర్‌ఫేస్‌, ఎమోజీల కోసం షార్ట్‌కట్‌, అప్‌డేటెడ్‌ వాయిస్‌ నోట్‌ ఫార్వార్డ్‌ వంటి తాజా ఫీచర్లను వాట్సాప్‌ తీసుకురానున్నట్లు సమాచారం. ఇప్పటికే టెస్టింగ్‌ కోసం ఈ కొత్త ఫీచర్లను పలువురు బీటా యూజర్లకు వాట్సాప్‌ అందుబాటులోకి తెచ్చింది.

మీ SBI అకౌంట్ BALANCE ఎంత? సింపుల్‌గా తెలుసుకోవచ్చు ఇలా

Reliance Jio: రిలయన్స్‌ జియో కీలక నిర్ణయం

JIO సునామి అఫర్: 899 రూపాయలకే 336 రోజుల అన్లిమిటెడ్ ప్లాన్

వాట్సాప్‌ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపిన సమచారం ప్రకారం.. వాయిస్‌ కాల్‌ కొత్త ఇంటర్‌ఫేస్‌ను ఐవోఎస్‌ బీటా టెస్టర్‌లకు వాట్సాప్‌ విడుదల చేసింది. ప్రత్యేకంగా గ్రూప్‌ వాయిస్‌ కాల్స్‌ కోసం ఈ ఫీచర్‌ను తీర్చిదిద్దారు. వాయిస్‌ కాల్‌ సమయంలో ఈ ఫీఛర్ గ్రూప్‌లోని ప్రతిఒక్కరికీ రియల్‌ టైమ్‌ వేవ్‌ఫారమ్‌లను చూపుతుంది. తద్వారా వాయిస్‌ కాల్‌లో ఎవరు మాట్లాడుతున్నారో, ఎవరు మ్యూట్‌లో ఉన్నారో ఈజీగా తెలుసుకునే వీలుంటుంది. అలాగే ఈ కొత్త ఇంటర్‌ఫేస్‌లో వాల్‌పేపర్‌లను కూడా వాట్సాప్‌ విడుదల చేయాలని యోచిస్తుంది.

మరోవైపు ఫార్వార్డ్‌ వాయిస్‌ నోట్స్‌, ఆడియో ఫైల్‌ల మధ్య తేడాను గుర్తించడానికి మరో సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్‌ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త ఫీచర్‌ ద్వారా ఫార్వాడ్‌ చేసిన వాయిస్‌ నోట్స్‌ ఇకపై నారింజ రంగులో కనిపించనున్నాయి. అలాగే ఇతరులతో చాటింగ్‌ చేస్తున్న సమయంలో ఎమోజీని త్వరగా ఎంచుకోవడానికి వాట్సాప్‌ షార్ట్‌కట్‌లు తీసుకువస్తుంది. ఈ మేరకు యూజర్లు ఇష్టపడే ఎమోజీకి సంబంధించి కీవర్ట్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ కొత్త ఫీచర్లను ప్రస్తుతానికి బీటా యూజర్లకు మాత్రమే పరిచయం చేసినా.. వీటిని ఐవోఎస్‌తో పాటు వెబ్‌, ఆండ్రాయిడ్‌ వినియోగదారులందరికీ వాట్సాప్‌ త్వరలో అందుబాటులోకి తీసుకొస్తుందని కచ్చితంగా చెప్పలేం. పైగా రాబోయే అప్‌డేట్‌లో ఈ ఫీచర్లకు సంబంధించి మరిన్ని మార్పులు కూడా ఉండొచ్చు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad