*చైల్డ్ ఇన్ ఫో లో HM చేసే Cadre Strength మరియు Teacher status - ఒక అవగాహన*
*1. Teacher status*:
Services లో staff నందు Teacher Status అనే tab ఉంటుంది.
ఇందులో మన పాఠశాల కి సంబంధించిన అందరు ఉపాధ్యాయులు కనబడతారు.
రిటైర్/ ట్రాన్స్ఫర్/ చనిపోయిన వారితో సహా.
HM గారు వీరి పేర్ల ముందు ఉన్న చెక్ బాక్స్ లను నొక్కి వారి status ని సెలక్టు చేసుకుని submit చేస్తారు.
Submit చేయగానే ఆ ఉపాధ్యాయుడు రిటైర్ అయిన వారా? ట్రాన్స్ ఫర్ అయిన వారా?? వర్కింగ్ వారా??? అని status చూపిస్తుంది.
కాని పేర్లు అన్నీ అక్కడ కనిపిస్తూ ఉంటాయి.
కంగారు పడవలసిన అవసరం లేదు.
( ఒకవేళ మనం పని చేసే వారిని అనుకోకుండా రిటైర్ అని చూపితే వారు కనబడకుండా పోతే తిరిగి పాఠశాలలో కి తెచ్చుకొనేందుకు ఇబ్బంది లేకుండా ఆ పేర్లు అక్కడే ఉంచడం జరుగుతుంది. వారి status మార్చితే తిరిగి working అవుతారు.)
*ఇప్పుడు HM గారు working అని సెలక్టు చేసుకున్న వారు మాత్రమే ఆ పాఠశాల లో పని చేసే వారు.*
*వీరి పేర్లు మాత్రమే పైన ఉన్న*
*cadre strength* *అనే tab లోకి వెళ్ళి, అక్కడ కనబడతాయి.*
అంటే వీరు మాత్రమే Active teachers అన్నమాట.
*2. ఇప్పుడు cadre strength ట్యాబ్*
Services లో staff లో cadre strength ట్యాబ్ నొక్కితే
పైన పోస్ట్ ల పేర్లు, అవి ఎన్ని పోస్ట్ లు??, ఎంతమంది వర్కింగ్???
*పెండింగ్* ఎంత అని చూపిస్తుంది.
*ఇదే టేబుల్ కింద ఇంతకుముందు మనం
*Teacher status* లో *working అని సెలక్టు చేసిన వారి పేర్లను మాత్రమే ఇక్కడ display చేయడం జరుగుతుంది.*
ఆయా పేర్లలో ఒక category/ designation కి చెందిన ఎన్ని పేర్లు ఉంటే అంత నంబర్ working లో ఆటోమేటిక్ గా చూపిస్తుంది.మనం ఎంటర్ చేయవలసిన పని లేదు..
ఉదాహరణకు
ఇద్దరు School Assistant( Maths) టీచర్ల పేర్లు కింద కనబడుతుంటే ....
working box దగ్గర 2 డిస్ ప్లే ఆటోమేటిక్ గ వస్తుంది.
ఇప్పుడు HM గారు Sanction అనే బాక్స్ లో 1 అని కొడితే ...అది తీసుకోదు.
ఇది ఓ exception . సిస్టం తీసుకోదు.ముందుకు వెళ్ళదు. ( ఇది పై అధికారికి తెలియజేయాలి)
Sanction బాక్స్ లో 2 అని కొడితే .... working ఇద్దరు ఉన్నారు కావున
...pending box "0" చూపిస్తుంది.
Sanction box లో 3 కొడితే...
Working "2" కాబట్టి
Pending box లో "1" వస్తుంది.
ఈ విధంగా HMగారు Sanction నంబర్ మాత్రమే ఎంటర్ చేయవలెను.
ఇప్పుడు
*pending* box లో ఎంత నంబర్ ఉంటే ఆ పోస్ట్ లో అంతమందిని మాత్రమే
Add చేసుకోగలము.
కావున ప్రధానోపాధ్యాయులు అందరూ గమనించి ,అవగాహన చేసుకొని cadre strength submit చేయగలరు.
*Plz Remember* :
*ముందు Teacher Status ట్యాబ్ submit చేయాలి*
తదుపరి మాత్రమే Cadre strength Tab పూర్తి చేయాలి.*