Group Exams: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం

 Group Exams: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం.. పూర్తి వివరాలివే

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (CM Jagan) తీపి కబురు చెప్పారు. రాష్ట్రంలో గ్రూప్‌-1, గ్రూప్-2 పోస్టుల (Group Posts) భర్తీకి ఆమోదం తెలిపారు. జాబ్‌ క్యాలెండర్‌లో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి అనుమతిచ్చారు. దీంతో గ్రూప్-1లో 110 పోస్టులు, గ్రూప్‌-2లో 182 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనిలో భాగంగా త్వరలోనే ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్లు (Notifications) జారీ చేయనుంది. 2020లో నిర్వహించిన సమావేశంలో అప్పటికే మెయిన్స్ పరీక్షకు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధుల్ని కొనసాగించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయని అభ్యర్ధులు తాజాగా హైకోర్టు దృష్టికి తెచ్చారు. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం 5 తప్పు ప్రశ్నల్ని సరిదిద్దిన తర్వాత కొత్తగా మెయిన్స్ కు షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్ధుల జాబితా తయారు చేయాలని ఆదేశించిందని గుర్తుచేశారు.

 గ్రూప్‌-1లో 110 ఖాళీలు .. అవి 

డిప్యూటీ కలెక్టర్లు-10, 

ఆర్‌టీవో-7, 

సీటీవో-12, 

జిల్లా రిజిస్ర్టార్‌-6, 

జిల్లా గిరిజన సంక్షేమ అధికారి-1, 

జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి-1, 

జిల్లా బీసీ సంక్షేమ అధికారి-3, డీఎ్‌సపీ(సివిల్‌)-13, 

డీఎ్‌సపీ(జైళ్లు)-2, 

అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌-3, 

మున్సిపల్‌ కమిషనర్‌-1, 

మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-2, 8, 

డిప్యూటీ రిజిస్ర్టార్‌(సహకార శాఖ)-2, 

ట్రెజరర్‌ గ్రేడ్‌-2-5, 

ఏఏవో(ట్రెజరీ)-8, 

ఏఏఏ(ఆడిట్‌ శాఖ)-4, 

ఏవో(డైరక్టర్‌ ప్రజారోగ్యం)-15, 

ఎంపీడీవో-7 పోస్టులకు ఆమోదం లభించింది

గ్రూప్‌-2లో 

డిప్యుటీ తహశీల్దార్‌ -30, 

సబ్‌ రిజిస్ర్టార్‌(గ్రేడ్‌-2)-16, 

అసిస్టెంట్‌ రిజిస్ర్టార్‌(సహకారం)-15, 

మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-3, 5, 

అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌-10, 

ఏఎ్‌సవో(లా)-2, 

ఎఎ్‌సవో(లెజిస్లేచర్‌)-4, 

ఏఎ్‌సవో(జీఏడీ)-50, 

సీనియర్‌ అకౌంటెంట్‌(ట్రెజరీ)-10, 

జూనియర్‌ అకౌంటెంట్‌(ట్రెజరీ)-20, 

సీనియర్‌ ఆడిటర్‌(స్టేట్‌ ఆడిట్‌)-5, 

ఆడిటర్‌(పే అండ్‌ అలవెన్స్‌)-10, 

జూనియర్‌ అకౌంటెంట్‌(సీసీఎస్‌)-5 పోస్టులు ఉన్నాయని ప్రభుత్వం వివరించింది.



Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad