SBI Car Loan: కార్ కొనేవారికి ఎస్‌బీఐ నుంచి అదిరిపోయే ఆఫర్

 SBI Car Loan: కార్ కొనేవారికి ఎస్‌బీఐ నుంచి అదిరిపోయే ఆఫర్.


మీరు కొత్త కార్ కొనాలనుకుంటున్నారా? సెకండ్ హ్యాండ్ కార్ కొనే ఆలోచనలో ఉన్నారా? లేదా ఎలక్ట్రిక్ కార్ కొంటారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కార్ లోన్ (Car Loan) తీసుకునేవారికి ప్రాసెసింగ్ ఫీజు, ప్రీపేమెంట్ పెనాల్టీ ఛార్జీలు తొలగించింది. కార్ లోన్ ప్రాసెసింగ్ కోసం ఎలాంటి ఛార్జీలు తీసుకోవట్లేదు. కార్ లోన్ తీసుకున్న తర్వాత లోన్ మొత్తాన్ని ఒకేసారి చెల్లించినా ప్రీపేమెంట్ పెనాల్టీ ఛార్జీలు ఉండవు. యోనో ప్లాట్‌ఫామ్ ద్వారా అప్లై చేసేవారికి ఈ ఆఫర్ లభిస్తుంది. ఫోర్ వీలర్ కొనాలనుకునేవారికి ఎస్‌బీఐ వేర్వేరు లోన్ ఆఫర్స్ అందిస్తోంది. ఎస్‌బీఐలో కార్ లోన్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి? ఎస్‌బీఐ యోనో యాప్‌లో కార్ లోన్‌కు ఎలా అప్లై చేయాలి? తెలుసుకోండి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎస్‌బీఐ న్యూ కార్ లోన్ స్కీమ్, లాయల్టీ కార్ లోన్ స్కీమ్, సర్టిఫైడ్ ప్రీ ఓన్డ్ కార్ లోన్, ఎస్‌బీఐ అష్యూర్డ్ కార్ లోన్ స్కీమ్, ఎస్‌బీఐ గ్రీన్ కార్ లోన్ పేరుతో పలు రకాల లోన్ ఆఫర్స్ లభిస్తున్నాయి. వడ్డీ రేట్లు చూస్తే ఎస్‌బీఐ కార్ లోన్, ఎన్ఆర్ఐ కార్ లోన్, అష్యూర్డ్ కార్ లోన్ స్కీమ్ ద్వారా ఫోన్ వీలర్ లోన్ తీసుకుంటే 7.25 శాతం నుంచి 7.95 శాతం వడ్డీ, లాయల్టీ కార్ లోన్ స్కీమ్‌కు 7.20 శాతం నుంచి 7.90 శాతం వడ్డీ, సర్టిఫైడ్ ప్రీ ఓన్డ్ కార్ లోన్ తీసుకుంటే 8.75 శాతం వడ్డీ, ఎస్‌బీఐ గ్రీన్ కార్ లోన్ తీసుకుంటే 7.05 శాతం, సర్టిఫైడ్ ప్రీ ఓన్డ్ కార్ లోన్ తీసుకుంటే 9.25 శాతం నుంచి 12.75 శాతం వడ్డీ చెల్లించాలి.

➧ SBI కస్టమర్లు ముందుగా యోనో ఎస్‌బీఐ అకౌంట్‌లో లాగిన్ కావాలి.
➧ Home పేజీలో త్రీ లైన్స్ పైన క్లిక్ చేయాలి.
➧ LOans సెక్షన్ ఓపెన్ చేయాలి.
➧ ఆ తర్వాత car loan ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
➧ ఆ తర్వాత మీ వివరాలను ఎంటర్ చేయాలి.
➧ కొనాలనుకుంటున్న వాహనం, తీసుకోవాలనుకుంటున్న లోన్ వివరాలు ఎంటర్ చేయాలి.
➧ వెహికిల్ ఎస్టిమేషన్ వివరాలు, ఇతర డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
➧ చివరగా సబ్మిట్ చేస్తే లోన్ నేరుగా డీలర్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది.

ఎస్‌బీఐ కస్టమర్లు తక్కువ వడ్డీకే కార్ లోన్ తీసుకోవచ్చు. కనీసం రూ.3 లక్షల నుంచి గరిష్టంగా రూ.1 కోటి వరకు లోన్ తీసుకోవచ్చు. ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. కొన్ని వాహనాలకు ఆన్ రోడ్ ధరలో 90 శాతం వరకు కార్ లోన్ లభిస్తుంది. ప్యాసింజర్ కార్లు, ఎస్‌యూవీలు, ఎంయూవీలు తీసుకోవడానికి రుణాలకు అప్లై చేయొచ్చు. ఏడేళ్ల వరకు టెన్యూర్ ఎంచుకోవచ్చు. కస్టమర్లకు ఆప్షనల్‌గా ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ కవర్ లభిస్తుంది. 

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad