Post Office Jobs 2022: రూ.63,200 వేతనంతో పోస్ట్ ఆఫీస్ జాబ్స్... అర్హత 10th

 Post Office Jobs 2022: రూ.63,200 వేతనంతో పోస్ట్ ఆఫీస్ జాబ్స్... టెన్త్ అర్హత


1. ఇండియా పోస్ట్ (India Post) వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ (Job Notification) విడుదల చేస్తున్నాయి. కేంద్ర సమాచార, ఐటీ శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ (Department of Posts) న్యూ ఢిల్లీలోని మెయిల్ మోటార్ సర్వీస్‌లో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 29 ఖాళీలు ఉన్నాయి. 

2. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 మార్చి 15 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాలి. అంటే అప్లికేషన్ ఫామ్స్ స్పీడ్ పోస్టు లేదా రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి. టెన్త్ పాస్ కావడంతో పాటు నోటిఫికేషన్‌లో సూచించిన డ్రైవింగ్ అర్హతలు కూడా అభ్యర్థులకు ఉండాలి. మరి ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, పూర్తి అర్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి. 

3. మొత్తం 29 ఖాళీలు ఉన్నాయి. అందులో అన్‌రిజర్వ్‌డ్- 15, ఎస్‌సీ- 3, ఓబీసీ- 8, ఈడబ్ల్యూఎస్- 3 పోస్టులున్నాయి. విద్యార్హతల వివరాలు చూస్తే 10వ తరగతి పాస్ కావడంతో పాటు లైట్ మోటార్ వెహికిల్, హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి

4. అభ్యర్థుల వయస్సు 27 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ, దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు ఫీజు లేదు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు

5. అభ్యర్థులు https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. Recruitment సెక్షన్‌లో Staff Car Driver (Ordinary Grade) నోటిఫికేషన్ క్లిక్ చేయాలి. దరఖాస్తు ఫామ్ నోటిఫికేషన్‌లో ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని పూర్తి చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి

CLICK HERE FOR DETAILS

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad