TEACHER ATTENDANCE APP NEW - FACE IDENTIFICATION

 సెల్ ఫోన్ ల ద్వారా టీచర్ల హాజరు నమోదు - కొత్త యాప్ అందుబాటులోకి తెచ్చిన పాఠశాల విద్యా శాఖ 



★మొబైల్ అటెండెన్స్ యాప్ ను(HAS టెక్నాలజీ తో రూపకల్పన) అందుబాటులోకి తెచ్చిన విద్యాశాఖ

★మొబైల్  అటెండన్స్ యాప్ ను(HAS టెక్నాలజీ తో రూపకల్పన) అందుబాటులోకి తెచ్చిన విద్యాశాఖ

★ ముఖ ఆధారిత హాజరు ఆండ్రాయిడ్ ఫోన్లలోనే(సొంత ఫోన్ల లొనే)

★పైలట్ ప్రాజెక్ట్ గా గుంటూరు జిల్లా సత్తెనపల్లి, పిడుగురాళ్ల పాఠశాలలు

★ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు సన్నాహాలు

★ ఒక్కొక్క ఉపాధ్యాయుని హాజరు 30 నుంచి 40 సెకన్ల లొనే

★పాఠశాల లో కాకుండా బయట ఎక్కడి నుంచి హాజరు  నమోదు చేసిన గుర్తించే సాంకేతికత

Note: No official instructions of implementation from Education department about this app for all districts as of now

DOWNLOAD NEW APP HERE

⭕Mobile Attendance App ఎలా attendance వెయ్యాలి

 మొదటగా Mobile Attendance App ను ఉపాధ్యాయుని ఫోన్ నందు లేదా మీ స్కూల్ ఐరిష్ ట్యాబ్ నందు లేదా మీ ఫింగర్ డివైస్ నందు install చేసుకోవాలి .

యాప్ install అయిన తరువాత యాప్ నందు మొదటగా లాగిన్ అవ్వాలి (ఫోన్ నెంబర్ మరియు welcome అనే పాస్వర్డు ద్వారా ) . 

 యాప్ లాగిన్ తరువాత HOME > Teachers Master నందు మొదటగా Teachers Master ఫోటో upload చేయాలి (లైవ్ లొకేషన్). ఇది చాలా కీలకాంశము. ఇది ఒక్కసారి మాత్రమే. ఇక్కడ ఫోటో తీసే సమయంలో ఫోటోలో మీరు తప్ప , వెనుక , ప్రక్కన వేరే ముఖాలు లేకుండా మంచి వెలుతురులో ఫోటో దిగాలి .

 తదుపరి HOME > Teachers Attendance నందు ప్రతీ రోజు MN - Mark / FN - Mark అని ఉన్న చోట క్లిక్ చేసి మనం మరల ఫోటో తీసుకోవాలి. ఇక్కడ మనం దిగిన ఫోటో , Teachers Master ఫోటో తో పోల్చుకొని /సరిచూసుకొని మనకు Success అని చూపుతుంది. తద్వారా మన హాజరు వివరాలు అంటే సమయం మరియు లొకేషన్ అన్ని సంబంధిత అధికారులకు చేరుతాయి. ఒకవేళ మన ఫోటో , Teachers Master ఫోటో తో సరిపోకపోతే మరల మనం మరొక సారి ప్రయత్నం చేయాలి. 

 తదుపరి HOME > Reports & Dashbord నందు Teachers Attendance వివరాలు తెలుసుకోవచ్చు.


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad