పాఠాలు బోధించని ఉపాధ్యాయుల జీతాలు రికవరీ చేయాలి.

 సమయపాలన పాటించకుండా  తరగతులు వెళ్లకుండా పాఠాలు బోధించని ఉపాధ్యాయుల యొక్క జీతాలు రికవరీ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 

వివరాల్లోకెళితే పేద కుటుంబానికి చెందిన ఒక పేరెంట్ తన కుమారుని ప్రైవేటు పాఠశాలలో డబ్బులు కట్టి చదివించ లేక  గత సంవత్సరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదుకూరులో ఏడో తరగతి లో చేర్పించారు కరోనా  కారణంగా ఉపాధ్యాయులు ఏడో తరగతి పాఠాలు బోధించలేదు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నారు. ఈ సంవత్సరం పాఠశాల రెగ్యులర్గా  జరుగుతుండటంతో విద్యార్థులు బాగా చదువుకుంటున్నారు అని  ఆశపడ్డారు కానీ వారి ఆశ నిరాశ అయింది.

జిల్లా పరిషత్ హై స్కూల్ మైదుకూరు నుందు ఉపాధ్యాయులు పాఠాలు బోధించడం లేదని వారికి తెలిసింది. ఈ విషయాన్ని తన కుమారుని అడగగా  ఆశ్చర్యకర విషయాలు తెలిసినవి లెక్కల టీచర్ 15 యూనిట్లు ఉంటే 7 యూనిట్లు బోధించాడని  సైన్స్ టీచర్ 12 యూనిట్లు ఉంటే 4 యూనిట్లు  పూర్తి చేశారని తెలుగు టీచర్ బోర్డ్  ఉపయోగించకుండా ఎలాంటి గ్రామర్ చెప్పకుండా పాఠాలు  వివరంగా చెప్పకుండా చదువుకుంటూ పూర్తి చేశాడు అని, సోషల్ టీచర్ ఒక పాఠం కూడా పూర్తిగా చెప్పకుండా హెడ్డింగ్ చదువుతూ పాఠాలు పూర్తి చేశారని చెప్పారు. అంతేకాకుండా తరగతుల ఉపాధ్యాయులు గైడ్స్ చూసి నోట్స్ రాసుకోండి అంటూ ఎలాంటి నోట్స్ కూడా చెప్పరు పేరుకే ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ లో ఎవరు భోదించరు అని చెప్పారు. 

ఇన్ని రోజులు ఈ విషయాలు ఎందుకు చెప్పలేదు అని అడిగితే చెబితే సార్లు కొడతారు, పరీక్షల్లో మార్కులు వేయరు అన్నారు. హెచ్ ఎం గారిని అడుగుగా టీచర్లు లేరు వస్తారు పొండి అన్నారు. మరి మీరు సిలబస్ కాకుండా FA3 పరీక్షలు  ఎలా రాశారు అంటే సమాధానం లేదు. అన్ని విషయాలు తెలుసుకున్న పేరెంట్స్ వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసినా స్పందన కార్యక్రమం లో ఫిర్యాదు చేశారు. వెంటనే ఫిర్యాదు పరిశీలించి మైదుకూరు ఎంఈవో గారికి పంపారు. ఏమ్ఈఓ గారు పాఠశాలకు వెళ్లి విచారణ జరిపి లెక్కల్లో 40 శాతం, ఫిజిక్స్ లో 30 శాతం సిలబస్ పూర్తి అయినట్లు మిగిలిన సిలబసు త్వరలో పూర్తి చేస్తామని హెచ్ఎం గారు చెప్పినట్లు రాతపూర్వకంగా పేరెంట్స్ కు అందించారు. ఎంఈఓ గారి సూచన మేరకు ప్రధానోపాధ్యాయురాలు అని అడుగగా మిస్టేక్ జరిగింది ఇక  ఇక జరగకుండా చూసుకుంటాను అన్నారు. స్పందన లో ఫిర్యాదు చేసిన విషయాన్ని తెలుసుకున్న లెక్కలు ఉపాధ్యాయుడు వెంటనే 11 వ యూనిట్ను మొదలు పెట్టి 11 యూనిట్లు చెప్పాను అని అబద్ధాలు చెప్పాడు. ఫిజికల్ సైన్స్ పోస్ట్ ఖాళీగా ఉండడం వల్ల పాఠాలు బోధించే లేదని హెచ్ఎం గారు చెప్పారు. ఈ విషయం డీఈవో గారికి తెలియజేశామని అయినా ఉపాధ్యాయుని నియమించలేదని అన్నారు. టీచర్లు నియమించుకోవడం వల్ల ఉన్న సైన్స్ టీచర్ తో పాఠాలుచేప్పించ క పోవడం వల్ల అన్ని తరగతుల విద్యార్థులు సైన్సు బోధన దూరమయ్యారు. హెచ్ఎం గారు, ఎంఈఓ గారు ఇచ్చిన రిపోర్టులో ఒక విధంగానూ పేరెంట్స్ కు మరో రకంగానూ తడబడుతూ అబద్దాలు చెప్పడం వల్ల ఈ మొత్తం వ్యవహారం ఆమెకు తెలిసే జరుగుతుందని ఉపాధ్యాయులు సరిగా పనిచేయడం లేదని అర్థమైంది.

 సుమారు ఈ పాఠశాలకు నెలకు 50 లక్షల రూపాయలు జీతాలు వస్తాయి. ఒక ఉపాధ్యాయుని లక్ష నుండి లక్షా యాభై వేల రూపాయల జీతం వస్తుంది . కాని చదువులు చెప్పకుండ విద్యార్థులను నాశనం చేస్తున్నారు. ఒక రోజు జీతం రాకుంటే ప్రభుత్వంపై తిరగబడే ఉపాధ్యాయులు మరి ఇంత మంది పిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే తల్లిదండ్రులు చూస్తూ ఉంటే భవిష్యత్తులో మీ పిల్లల భవిష్యత్తు ఆందోళనకరంగా ఉంటుందన్నారు. ఎవరైనా విద్యార్థులు పాఠాలు బోధించే ఉపాధ్యాయులు ప్రశ్నిస్తే వారిని రౌడీలు గాను అసాంఘిక వ్యక్తులు చిత్రీకరించి పోలీసుల్ని పిలిపించి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని విషయం తెలిసింది. తల్లిదండ్రులు ఇప్పటికైనా వారి పిల్లలతో మాట్లాడి విషయాలు తెలుసుకొని స్పందించాలని కోరాడు అధికారులు స్పందించి విద్యా సంవత్సరం పూర్తి అవుతున్నా పాఠాలు బోధించ ఉపాధ్యాయులు మరియు వారిని వెనకేసుకు వస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయురాలు పై చర్యలు తీసుకొని పేద విద్యార్థులకు న్యాయం చేయాలని అధికారులను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాము.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad